Viral Video: కాలినడకన వెళ్తుండగా.. కాళ్లను చుట్టిన పాము
close

Published : 31/07/2021 23:34 IST
Viral Video: కాలినడకన వెళ్తుండగా.. కాళ్లను చుట్టిన పాము

హైదరాబాద్‌: కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, జంగపల్లిలో పాము కలకలం రేపింది. కాలినడకన వెళుతున్న రాజయ్య అనే వ్యక్తి కాలుకు పాము చుట్టుకోవడంతో ఆందోళన చెందాడు. పాము శరీరంపైకి ఎగబాకే ప్రయత్నం చేయగా అతనికి ముచ్చెమటలు పట్టాయి. అంతలోనే తేరుకున్న రాజయ్య భయపడకుండా పాము తలను గట్టిగా పట్టుకున్నాడు. మరొకరి సాయంతో పామును వదిలించుకుని, తర్వాత కర్రతో కొట్టి చంపాడు. అక్కడున్న కొంతమంది ఈ ఘటనను వీడియోతీసి సామాజిక  మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని