Viral Video: జిలేబి ఒక్కటే.. బరువేమో 1 కిలో..!
close

Published : 27/07/2021 22:27 IST
Viral Video: జిలేబి ఒక్కటే.. బరువేమో 1 కిలో..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో మిఠాయిలకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. పండుగలు, పుట్టినరోజు, వివాహాలు, ప్రారంభోత్సవాలు.. ఇలా ప్రతి వేడుకలోనూ రకరకాల మిఠాయిలను అతిథులకు వడ్డించే సంప్రదాయాన్ని అనాదిగా భారతీయులు పాటిస్తున్నారు. ఇక వీటిని అమితంగా ఇష్టపడేవారు కిలోల కొద్దీ వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు బాగా ఇష్టపడే ఒక్కటే మిఠాయి కిలో బరువుండటం మీరెప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి.

ఇండోర్‌లోని సరాఫా బజార్‌లో ఓ మిఠాయిల తయారీదారు తన జిలేబీలతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాడు.  కిలో బరువున్న జిలేబీలతో అందరికీ నోరూరింపజేస్తున్నాడు. గత 33 ఏళ్లుగా అతడి కుటుంబం జిలేబీలను తయారు చేస్తున్నట్టు వెల్లడించాడు.  అతడు కిలో బరువున్న జిలేబీ తయారు చేస్తున్న వీడియోను ఓ ఫుడ్‌ బ్లాగర్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. మిఠాయిలు.. అందులోనూ జిలేబీలు అంటే ఇష్టపడేవారు ఆ వీడియోను చూసి లొట్టలేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా దీన్ని  ఇన్‌స్టాగ్రామ్‌లో 12,42,433 మంది వీక్షించారు. 

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని