korean Saranga dariya: కొరియన్‌ యువతి నోట ‘సారంగ దరియా’ పాట
close

Published : 12/09/2021 18:33 IST
korean Saranga dariya: కొరియన్‌ యువతి నోట ‘సారంగ దరియా’ పాట

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీతానికి ఎల్లలు లేవంటారు. తెలుగులోని ఎన్నో పాటలను వేరే భాషకు చెందిన గాయకులు పాడుతుంటారు. అలానే విదేశీయులు తెలుగు పాటలకు డ్యాన్సు కట్టడం చూశాం. టాలీవుడ్‌ సినిమాల సీన్లకు హావభావాలను పలికిస్తూ సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ అయిన వారూ ఉన్నారు. అయితే కొరియాకు చెందిన ఓ యువతి ఇటీవల బాగా ప్రసిద్ధిగాంచిన తెలుగు పాటను ఆలపించి ఔరా అనిపించింది. లవ్‌స్టోరీ సినిమాలో మంగ్లి ఆలంపించిన ‘సారంగ దరియా’పాటకు 32 కోట్ల వీక్షణలు వచ్చాయి. అలానే కొరియన్‌ యువతి తెలుగులో పాడిన పాటను కూడా దాదాపు తొమ్మిది లక్షల మంది వీక్షించడం విశేషం. తెలుగు యాసను అందిపుచ్చుకుని ఆమె పాడిన తీరు నెటిజన్లను అబ్బురపరిచింది. ఆమె పాడిన పాటకు సంబంధించిన వీడియోను మీరూ చూసేయండి..



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని