Viral Video: కోతి తన పిల్లకు స్నానం ఎలా చేయించిందో చూడండి!
close

Published : 29/07/2021 00:00 IST
Viral Video: కోతి తన పిల్లకు స్నానం ఎలా చేయించిందో చూడండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు అప్పుడప్పుడు స్నానం చేయనని మారం చేస్తారు. అమ్మ స్నానం చేయమని బుజ్జగిస్తుంది. మాట వింటే సరేసరి! లేకపోతే బలవంతంగా స్నానం చేయిస్తుంది. ఆ విధంగా ఓ కోతి బలవంతంగా తన పిల్లలకు స్నానం చేయించింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. 

ఒక చిన్న నీటి మడుగు దగ్గర ఓ కోతి తన పిల్లను పట్టుకుని కూర్చుంది. అప్పటి వరకూ తన పొత్తిళ్లలో ఉన్న పిల్లకోతి నీటిని చూడగానే భయపడింది. దాంతో తల్లి కోతి బలవంతంగా పిల్లకోతిని తన నుంచి విడిపించి నీటి మడుగులో ఒక ముంచు ముంచింది. గట్టు మీద కూర్చోబెట్టి స్నానం చేయించింది. ఆ దృశ్యాలు నవ్వులు పూయిస్తున్నాయి. సుశాంత్‌ నందా అనే ఫారెస్ట్‌ అధికారి ట్విట్టర్‌ ద్వారా ఈ వీడియోను పంచుకోగా.. ‘‘భారతీయ తల్లులు తమ కాళ్ల మీద పిల్లలను పడుకోబెట్టి ఈ విధంగానే స్నానం చేయిస్తారు. దక్షిణ భారత దేశంలో ఇలా చేయడం సర్వసాధారణం’’ అని, ‘‘తల్లే పిల్లలకు మొదటి గురువు’’ అనీ నెటిజన్లు విభిన్న రీతుల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని