Viral Video: పాముకు రాఖీ కట్టబోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు!
close

Published : 23/08/2021 21:43 IST
Viral Video: పాముకు రాఖీ కట్టబోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాఖీ పండగ రోజు ఓ వ్యక్తి అత్యుత్సాహం అతడి ప్రాణాలు పోయేలా చేసింది. బిహార్ సరణ్ జిల్లాలోని మాంజీ సీతల్ పుర్ గ్రామానికి చెందిన మన్మోహన్ పాములు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. పాము కాటుకు గురైన వారికి చికిత్స చేయటంలో అతడికి ఆ చుట్టుపక్కలా మంచి పేరుంది. రాఖీ పండగ రోజు స్థానికుల సమక్షంలో పాములకు రాఖీ కట్టే సాహసానికి పూనుకున్నాడు. రెండు విష సర్పాలను పట్టుకుని రాఖీ కట్టి వాటిని దీవించే క్రమంలో ఓ పాము కాలిపై కాటేసింది. వైద్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతోమంది బాధితులకు నయం చేసిన మన్మోహన్ అదే పాము కాటుకు బలికావడంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు. మన్మోహన్‌ పాములకు రాఖీ కడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని