Viral Video: దాటబోయాడు...బురదలో మునిగిపోయాడు
close

Published : 29/07/2021 01:05 IST
Viral Video: దాటబోయాడు...బురదలో మునిగిపోయాడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా చాలా అటవీ ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ నీటి గుంటలు ఉండి  బురదమయంగా ఉంటాయి. కొన్ని అడవుల్లోనైతే కాలుతీసి కాలు వెయ్యలేని పరిస్థితులుంటాయి. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనుషులు వెళ్లినప్పుడు బురద అంటకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. మాల్దీవుల్లోని అడవుల్లో సరదాగా గడుపుదామనుకున్న ఓ బ్రిటిష్ పర్యాటకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. 

మార్టిన్‌ లూయిస్ అనే బ్రిటిష్ పర్యాటకుడు తన భార్యతో కలిసి మాల్దీవుల్లోని ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని వెళ్లాడు. అయితే, అటవీ ప్రాంతంలో దూర భారం తగ్గుతుందనే ఉద్దేశంతో ఓ బురద గుంట దాటే ప్రయత్నం చేశాడు. కానీ, అది చిన్న బురద గుంట కాదు. మనిషి మునిగేంత లోతుంది. ఈ విషయం తెలియక మార్టిన్‌ చెప్పులను చేతిలో పట్టుకుని ఆ నీటిలో అడుగు వేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ నీటిగుంటలో మునిగిపోయాడు. కొన్నిసెకన్లపాటు అందులో ఉండిపోయి పైకి వచ్చాడు. మార్టిన్‌ నీటిగుంటను దాటుతున్న సమయంలో అతని భార్య వీడియో తీసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. మీరు కూడా ఆ వీడియోని చూసేయండి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని