
దిల్లీ: కరోనా పరిస్థితుల నేపథ్యంలో పీపీఈ కిట్ల వాడకం బాగా పెరిగింది. ఆసుపత్రుల్లోనూ, జనసమ్మర్థ ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రభుత్వమే వీటిని ఉచితంగా సరఫరా చేస్తోంది. అయితే, పీపీఈ కిట్లు ధరించి కొందరు దుండగులు దొంగతనాలకు పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దిల్లీలోని నగల దుకాణంలో ఓ వ్యక్తి పీపీఈ కిట్ ధరించి 25 కిలోల బంగారాన్ని చోరీ చేశాడు. ఆ సమయంలో అక్కడ సాయుధులైన ఐదుగురు భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ వారి కళ్లుగప్పి అపహరించుకుపోయాడు. తీరా సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తే దొంగ ఎంత చాకచక్యంగా తప్పించుకుపోయాడో తెలిసి ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. దొంగలించిన బంగారాన్ని ఆటోలో తరలించినట్లు గుర్తించామని, నిందితుడిని అరెస్టు చేశామని అధికారులు వెల్లడించారు. నిందితుడిని కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం దక్షిణ దిల్లీలోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో పని చేస్తున్నాడని, పక్కా ప్రణాళిక ప్రకారమే దొంగ తనానికి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు బుధవారం రాత్రి 9.30 సమయంలో దుకాణంలోకి ప్రవేశించి తెల్లవారు జామున 3 వరకు అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీ చదవండి
సీరం సంస్థలో భారీ అగ్నిప్రమాదం
రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
- మీ నోటి నుంచి దుర్వాసన? అయితే జాగ్రత్త..!
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- తొలి ట్వీట్‌కు రూ.18.30 కోట్లు!