close

Published : 09/03/2021 23:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Viral: వానరాల రోప్‌వే చూశారా!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రకృతి ఒడి లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లి రోప్‌వే ఎక్కితే పర్యాటకులకు కలిగే అనుభూతే వేరు. మరి ఆ మజా తమకు వద్దా? అనుకున్నాయో.. ఏమో ఈ వానరాల గుంపు! పచ్చటి ప్రదేశాలకు వెళ్లి మానవులు చేసే అదే అల్లరిని కాంక్రీటు అభయారణ్యంలో చేసి చూపించాయి. అగ్గిపెట్టెల్లాంటి భవనాల మధ్య ఉన్న కేబుల్‌ తీగలపై.. ఒకదానిని మించి మరోటి పోటీ పడుతూ వినూత్న రీతిలో రోప్‌వేపై జారుతూ తెగ సందడి చేశాయి. సాధారణ మనుషులకైతే ఇది ఒళ్లు గగుర్పొడిచే సాహాసమే అయినప్పటికీ.. వానరాలు కదా సునాయాసంగా చేసేశాయి. ఎక్కడ జరిగిందో తెలీదు గానీ ఈ కోతుల గుంపు చేసిన సందడిని ఓ జంతు ప్రేమికుడు కెమెరాలో బంధించగా.. అటవీ శాఖ అధికారి పర్వీన్‌ కాస్వాన్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ సందడిని మీరూ చూసేయండి..


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు