Viral Video: పులి పంజాకు దొరకని మయూరం!
close

Published : 20/07/2021 23:55 IST
Viral Video: పులి పంజాకు దొరకని మయూరం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రూర మృగాలను ఊరికే నిద్ర లేపకూడదు. అలాచేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే..! ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇదిగో ఈ పులి పంజా నుంచి తప్పించుకున్న మయూరం గురించి చెప్పేందుకే. వివరాల్లోకి వెళ్తే.. ఒక పులి పచ్చిక మైదానాల్లో సరస్సు ఒడ్డున హాయిగా నిద్రపోతోంది. అందమైన నెమలి అక్కడికి వచ్చి తన చుట్టుపక్కల ఎవరూ లేరనుకుని పింఛాన్ని విప్పుతూ కూత పెట్టింది. ఆ శబ్దానికి పులి నిద్రనుంచి మేల్కొంది. తన నిద్ర చెడగొట్టిన నెమలిని చంపేయాలని.. ఒక్క ఉదుటున ముందుకు దూకింది. తన పంజాతో నెమలిని కొట్టబోయింది. దీంతో అప్రమత్తమైన మయూరం పులికి దొరక్కుండా ఎగిరిపోయి తప్పించుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని