Viral Video: సోనూసూద్‌ పుట్టినరోజుకు అభిమాని అపురూప కానుక..!
close

Published : 01/08/2021 22:52 IST
Viral Video: సోనూసూద్‌ పుట్టినరోజుకు అభిమాని అపురూప కానుక..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటనతోపాటు సమాజసేవతో దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు సోనూసూద్‌ పుట్టిన రోజును ఓ అభిమాని మరింత ప్రత్యేకంగా మార్చాడు. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా విపుల్‌ మిరాజ్‌కర్‌ అనే కళాకారుడు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సోనూసూద్‌ చిత్రపటాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఆ వీడియోను షేర్‌ చేస్తూ విపుల్‌ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకు ఆ వీడియోను 3.90 లక్షల మందికిపైగా వీక్షించారు. 1999లో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన సోనూసూద్‌.. టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా గతేడాది విధించిన లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలకు సహాయం చేశాడు. దేశవ్యాప్తంగా పేదలకు ఆప్తుడిగా మారాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని