Viral: పార్లమెంట్‌లో ఎలుక హల్‌చల్‌.. పరుగులు పెట్టిన సభ్యులు!
close

Published : 22/07/2021 23:20 IST
Viral: పార్లమెంట్‌లో ఎలుక హల్‌చల్‌.. పరుగులు పెట్టిన సభ్యులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్పెయిన్‌లో అండలూసియా పార్లమెంట్‌లో ఎలుక హల్‌చల్‌ చేసింది. సాధారణ సమావేశాల్లో భాగంగా కీలక తీర్మానంపై ఓటింగుకు సంబంధించి స్పీకర్ మార్తా బోస్కెట్ సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక ఎలుక ఎంపీలు కూర్చున్న టేబుల్ పైకి ఎక్కడాన్ని చూసిన స్పీకర్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎలుకను చూసిన కొంతమంది ఎంపీలు భయంతో ఉరుకులు పరుగులు పెట్టగా, మరికొందరు టేబుళ్లపైకి ఎక్కడానికి ప్రయత్నించారు. చివరకు అనేక తంటాలు పడి ఎలుకను బయటకు పంపించి ఓటింగ్ ప్రక్రియను తిరిగి నిర్వహించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని