Viral video: ఒకే దిశలో నాలుగు రైళ్లు కదిలితే.. 
close

Published : 11/09/2021 00:20 IST
Viral video: ఒకే దిశలో నాలుగు రైళ్లు కదిలితే.. 

ఇలా ఎక్కడ జరిగిందంటే...

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెట్టింట్లో చూసే వీడియోల్లో.. అరుదుగా జరిగే సంఘటనలకు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. వాటిని చూసేటప్పుడు ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తాం. సరిగ్గా అలాంటి అరుదైన వీడియోనే ట్విటర్ వేదికగా పంచుకున్నారు ఐపీఎస్‌ రుపిన్‌ శర్మ. ‘‘నాలుగు రైళ్లు ఒకే దిశలో కలిసి నడుస్తున్న అరుదైన వీడియో’’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఆవిరి ఇంజిన్‌ రైళ్లు ప్రారంభమై  ప్లాట్‌ఫామ్ మీదకు రాగానే అక్కడ ఉన్న వారంతా తమ కెమెరాల్లో ఈ దృశ్యాన్ని బంధించారు. అయితే ఇది ఏ ప్రదేశంలో జరిగిందనే సమాచారం లేకపోయే సరికి.. దాన్ని వెతికే పనిలో పడ్డారు నెటిజన్లు. ఇది 2016లో జరిగిందని.. ఆస్ట్రేలియాలోని హంటర్‌వ్యాలీ స్టీమ్ ఫీస్ట్‌లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. కాన్‌బెర్రా రైల్వే మ్యూజియం, లచ్లాన్ వ్యాలీ రైల్వే, ట్రైన్‌ వర్క్స్‌ నుంచి తీసుకొచ్చిన లోకోమోటివ్స్‌ ఇలా ఒకేసారి పయనమయ్యాయని చెప్పాడో నెటిజన్‌.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని