Viral Video: గేదెతో ముఖాముఖీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
close

Published : 22/07/2021 19:46 IST
Viral Video: గేదెతో ముఖాముఖీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో!

ఇంటర్నెట్‌ డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన ఒక రిపోర్టర్‌ గేదెను ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని సులువైన ప్రశ్నలు అడిగారు. గేదె వాటికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. 

పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌ అమిన్‌ హఫీజ్‌ లాహోర్‌లోని ఒక గేదెను సరదాగా ఇంటర్వ్యూ చేశారు. ‘లాహోర్‌లో ఉండటం మీకు ఎలా అనిపిస్తుంది?’ అని గేదెను అడగ్గా.. అది ఒక్క సారిగా అరిచింది. దాన్ని సమాధానంగా తీసుకుని.. గేదెకు లాహోర్‌ నచ్చిందని రిపోర్ట్‌ చేశారు. ‘లాహోర్‌లో ఆహారం బాగుందా? లేక మీ గ్రామంలోని ఆహారం బాగుందా?’ అని మరో ప్రశ్న అడగ్గా.. గేదె మళ్లీ అరిచింది. లాహోర్‌లోని ఆహారమే బాగుందని గేదె సమాధానం చెప్పినట్టు రిపోర్ట్‌ చేయడం నవ్వు తెప్పిస్తోంది. ఆద్యంతం నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియోను నైలా ఇనాయత్‌ అనే జర్నలిస్ట్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు.  


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని