close

Published : 28/07/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా కాలం: చీరలో కదిలి వచ్చే భద్రత

వైరల్‌ అవుతున్న వీడియో

ఇంటర్నెట్ డెస్క్‌: అవసరమే ఆవిష్కరణకు పునాది అంటారు. ప్రపంచ వ్యాప్తంగా వేళ్లూనుకున్న కొవిడ్‌-19 మహమ్మారి, సాంకేతిక రంగంలో ఎన్నో కొత్త వస్తువులు కనుగొనటానికి దారితీసిందని చెప్పవచ్చు. ఇక నిత్య జీవితంలో కాలితో ఉపయోగించగల సానిటైజర్‌ నుంచి.. పూర్తి శరీరాన్ని క్రిమిరహితం చేయగల ‘డిసిన్‌ఫెక్టింగ్‌ టన్నెల్‌’ యంత్రం వరకు కరోనా వైరస్‌ ఎన్నో ఆవిష్కరణలకు కారణయింది. ఇందుకు మరో ఉదాహరణ అనదగ్గ వీడియోను ఓ అటవీ శాఖ అధికారిణి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

విపరీతంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో... భారతీయ సంప్రదాయ బద్ధంగా చీరకట్టులో ఉన్న ఓ రోబోను చూడవచ్చు. ఈ మర మహిళను చెన్నైలోని ఓ వస్త్ర దుకాణంలో ఏర్పాటు చేసారు. వినియోగదారులు ఎక్కడ ఉన్నారో గుర్తించి, తనంతట తానే వారి వద్దకు వెళ్లి మరీ సానిటైజర్‌ను అందచేయటం దీని ప్రత్యేకత. 44 సెకెన్ల పాటు సాగే ఈ వీడియోలోని రోబో ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. కొనుగోలుదారులకు భద్రతతో పాటు వారికి కాస్త వినోదం కూడా అందించటంలో యాజమాన్యం సానిటైజింగ్‌ రోబో ఆలోచన విజయవంతమైందని నెటిజన్లు భావిస్తున్నారు. క్లిష్ట కాలంలో సాంకేతికతను సరైన రీతిలో ఉపయోగించుకున్నందుకు ఆ దుకాణ యాజమాన్యానికి ప్రశంసలు లభిస్తున్నాయి. మరి ఇందరికి నచ్చిన ఈ వీడియోను మీరూ చూసేయండి మరి!
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.