Viral Video: పట్టు తప్పిన ఊయల
close

Published : 15/07/2021 23:55 IST
Viral Video: పట్టు తప్పిన ఊయల

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్నిసార్లు సరదాగా చేసే విన్యాసాలు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయి. రష్యాలోని కాస్పియన్‌ సముద్రం వద్ద కొండ అంచున ఊయలపై ఊగాలన్న సరదా తీర్చుకునేందుకు వెళ్లిన ఇద్దరు యువతులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.  ఊయల పట్టు తప్పడంతో ఇద్దరూ లోయలోకి పడిపోయారు. అంతే.. అక్కడున్నవారంతా షాక్‌కి గురయ్యారు. అయితే వారికి ఎలాంటి ప్రాణాపాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

వీడియోలో.. 6 వేల అడుగుల ఎత్తులో ఓ కొండ అంచు వద్ద ఏర్పాటు చేసిన ఊయలపై ఇద్దరు యువతులు కూర్చున్నారు. ఆ ఊయలను వెనుక నుంచి ఓ వ్యక్తి ఊపుతూ కనిపించాడు.  కొద్దిసేపటి తర్వాత ఆ ఊయలకు ఒకవైపు గొలుసు తెగడంతో అది పక్కకు తిరిగింది. దాంతో పట్టు తప్పి వారు లోయలోకి పడిపోయారు. అయితే వారు కొండ అంచున ఉన్న చెక్కపై పడటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో వారికి స్వల్పంగా గాయాలయ్యాయి.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఊయలలు ఏర్పాటు చేసిన పలు ప్రదేశాలను వారు తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అయితే తాజాగా ప్రమాదం జరిగిన ఊయల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అక్కడి పర్యాటక శాఖ గుర్తించింది. ఆ ఊయలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 

 

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని