మంటల్లో చిన్నారి.. ఆ తల్లి ఎలా కాపాడుకుందంటే..?
close

Published : 16/07/2021 23:35 IST
మంటల్లో చిన్నారి.. ఆ తల్లి ఎలా కాపాడుకుందంటే..?

డర్బన్‌: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్​ జుమాకు జైలు శిక్ష విధించినప్పటి నుంచి ఆ దేశం అట్టుడుకుతోంది. అల్లర్లు, దొంగతనాలతో హింసాత్మక వాతావరణం  నెలకొంది. ఈ నేపథ్యంలోనే డర్బన్‌లోని ఓ భవనానికి దొంగలు నిప్పంటించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే నలేది మన్యోని అనే మహిళ, ఆమె రెండేళ్ల కుమార్తె మెలోకుహ్లే ఆ భవనంలోని మంటల్లో చిక్కుకున్నారు. చుట్టూ మంటలు.. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ మహిళ తన రెండేళ్ల చిన్నారిని భవనం పైనుంచి విసిరేసింది. అదృష్టవశాత్తు పాపను కింద ఉన్న కొందరు పట్టుకోవడంతో బిడ్డను మళ్లీ కలుసుకోగలిగింది ఆ తల్లి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మాజీ అధ్యక్షుడు జాకబ్​జుమాకు జైలు శిక్ష విధించినప్పటి నుంచి దక్షిణాఫ్రికాలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. కీలక వాణిజ్య కేంద్రాలుగా ఉన్న ప్రావిన్సుల్లో జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాలు.. చివరకు అల్లర్లు, దోపిడీలకు దారితీశాయి. నిరసనకారులు ఆహారం, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మద్యం, వస్త్రదుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌పై దాడి చేసి వాటిని లూటీ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో తొక్కిసలాటల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలీసులు, సైన్యాన్ని రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 219 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని