close

Published : 19/02/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాహుల్‌ గాంధీ మాటలు.. యువత కేరింతలు

పుదుచ్చేరి: కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ పుదుచ్చేరిలో ఓ కళాశాలలో సందడి చేశారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు తాను సాధారణంగా ధరించే దుస్తులకు భిన్నంగా ఈసారి ఆయన చక్కని టీషర్ట్‌లో దర్శనమిచ్చారు. విద్యార్ధుల్లో ఒకరిగా కలసిపోయిన ఈ యాభై ఏళ్ల నేత.. తనను రాహుల్ అని పేరు పెట్టి పిలవాలంటూ అక్కడి యువతను హుషారు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..

మేలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌  భారతీదాసన్‌ ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఓ యువతి సందేహం అడిగేందుకు గాను రాహుల్‌ గాంధీని ‘సార్‌’ అని పిలిచింది. ఇందుకు ఆయన వెంటనే స్పందించి ‘‘అందరూ వినండి. నా పేరు సార్‌ కాదు. నా పేరు రాహుల్.. నన్ను దయచేసి రాహుల్‌ అనే పిలవండి. మీరు మీ ప్రిన్సిపల్‌ను, ఉపాధ్యాయులను సార్‌ అని పిలవచ్చు. కానీ నన్ను మాత్రం రాహుల్‌ అనే పిలవాలి.’’ అని  జవాబిచ్చారు. ఇందుకు సభలో ఉన్న వారు కేరింతలు, కరతాళ ధ్వనులతో తమ మద్దతును తెలియచేశారు. ఆపై మరో విద్యార్థిని.. మిమ్మల్ని ‘రాహుల్‌ అన్నా’ అని పిలవచ్చా అని అడగ్గా.. అది మరీ మంచిది అంటూ ఆయన చెప్పటంతో అక్కడి వారు మరింత హర్షం వ్యక్తం చేశారు.
ఇది  ‘ఓ సున్నితమైన సందర్భం..’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఈ ఉదయం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇక అప్పట్నించీ ఈ వీడియో  విపరీతంగా వైరల్‌ అవుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు