Viral video: సొరంగంలో విమాన విన్యాసం.. గిన్నిస్‌ రికార్డు సొంతం..!
close

Published : 08/09/2021 12:47 IST
Viral video: సొరంగంలో విమాన విన్యాసం.. గిన్నిస్‌ రికార్డు సొంతం..!

ఇంటర్నెట్ డెస్క్‌: గాల్లో చక్కర్లు కొడుతూ విమానాలతో చేసే విన్యాసాలు మనం చాలా చూస్తూనే ఉంటాం. కానీ ఇటలీకి చెందిన ఓ సాహస పైలట్‌ మాత్రం రెండు సొరంగాల్లోంచి విమానం నడిపి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. విమాన విన్యాసకుడు డారియో కోస్టా.. టర్కీలోని ఇస్తాంబుల్‌లో.. 2.6 కిలోమీటర్ల పొడవున్న రెండు సొరంగాల్లో గంటకు 245.07 కిలోమీటర్ల వేగంతో విమానం నడిపి ఈ రికార్డు సాధించాడు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియోను ఆస్ట్రియాకు చెందిన రెడ్‌బుల్‌ కంపెనీ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ నెల 4న పోస్టు చేసింది. విమాన విన్యాసాలను డారియో మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాడంటూ రెడ్‌బుల్ అందులో పేర్కొంది. ఇప్పటివరకు ఈ వీడియోను 1.4 లక్షల మంది వీక్షించారు. 62 వేల మంది షేర్‌ చేశారు. ఈ సాహసం చేసిన తర్వాత డారియో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు విమానంలోని కెమెరాలో రికార్డయ్యాయి.

అయితే ఈ విన్యాసంతో డారియో మరికొన్ని రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. సొరంగం ద్వారా నడిపిన తొలి విమానం, సొరంగం నుంచి తొలిసారిగా విమానం టేకాఫ్‌ చేయడం, సొరంగ మార్గం ద్వారా ఎక్కువ దూరం విమానం నడిపిన ఘనతలను డారియో సాధించడం విశేషం. డారియో చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని