Viral Video: నెటిజన్లను అబ్బురపరుస్తున్న అరుదైన జంతువు
close

Published : 26/07/2021 22:27 IST
Viral Video: నెటిజన్లను అబ్బురపరుస్తున్న అరుదైన జంతువు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య వచ్చిన డిస్నీ యానిమేషన్‌ సినిమా ‘రాయా’లో టుక్‌ టుక్‌ అనే జంతువును చూసే ఉంటారు. హీరోయిన్‌ రాయాకు అది ఎంతగానో సాయపడుతుంది. కాగా, ఆ పాత్రను ఆమడిల్లో అనే జంతువు ఆధారంగా రూపొందించారు. ప్రమాదం వచ్చినప్పుడు బంతిలా మారిపోవడం దీని ప్రత్యేకత. బలమైన పెంకులు దీని శరీరం మీద కవచంలా ఉండటంతో దీన్ని కవచకేసి అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. లాస్‌ ఏంజల్స్‌కు చెందిన రెప్టైల్‌ జూ వ్యవస్థాపకుడు జే బ్రూవర్‌  ‘‘ఆమడిల్లోస్‌ ఆసక్తికరమైన జంతువులు. దీన్ని చూస్తే నాకు పోకీమాన్‌ గుర్తొస్తుంది’’ అని శీర్షికను జతచేసి కవచకేసిని తన చేతులతో పట్టుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నారు. అది కాస్తా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని