Viral video: రిబ్బన్‌ కట్టింగ్‌ ఇలా కూడా చేస్తారా?
close

Published : 03/09/2021 23:59 IST
Viral video: రిబ్బన్‌ కట్టింగ్‌ ఇలా కూడా చేస్తారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా షాప్‌, ఇల్లు, కార్యక్రమం ప్రారంభోత్సవం రోజున రిబ్బన్‌ కట్టింగ్‌ ఎలా చేస్తారంటే ‘కత్తెరతోనే కదా’ అని టక్కున చెప్పేస్తాం. కానీ, ఆ మంత్రి మాత్రం తన నోటితో రిబ్బన్‌ కట్టింగ్‌ చేసి నవ్వులు పూయించారు. గురువారం పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జరిగిన ఓ ఎలక్ట్రానిక్‌ షాప్‌ ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అక్కడి మంత్రి ఫయాజ్‌ హసన్‌ చౌహన్‌.  పక్కనే కత్తెర కనిపిస్తున్నా తన నోటితో రిబ్బన్‌ కట్టింగ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముర్తాజా షేర్‌ అనే విలేకరి ట్వీట్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఇక ఫన్నీ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు నెటిజన్లు. ‘‘కత్తిర కన్నా మీ పళ్లు చాలా షార్ప్‌’’ అని కొందరు, ‘‘మీరు ఒక లెజెండ్‌’’ని పొగుడుతూ వచ్చారు. ఇదిలా ఉండగా అసలు తాను ఎందుకలా చేయాల్సి వచ్చిందో ఓ వీడియోని ట్వీట్‌ చేశారా మంత్రి. కత్తెర పదును లేకపోవడంతో రిబ్బన్‌ కట్‌ కాలేదని, అందుకే అలా చేశానంటూ వివరణ ఇచ్చారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని