Viral Video: చంద్రుడిని చూసి ట్రాఫిక్‌ లైట్‌ అనుకుంటున్న కారు!
close

Published : 28/07/2021 00:12 IST
Viral Video: చంద్రుడిని చూసి ట్రాఫిక్‌ లైట్‌ అనుకుంటున్న కారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలన్‌ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ కార్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్‌. ఎక్కువగా ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేసే టెస్లా.. ఆటోపైలట్‌మోడ్‌ను కూడా పరిచయం చేసింది. ఈ మోడ్‌ను ఆన్‌ చేస్తే కారు దానంతట అదే నడుస్తుంది. ఇందుకోసం కారు ముందుభాగంలో కెమెరా లెన్సులు అమర్చారు. ముందు వెళ్తున్న వాహనాలను గమనిస్తూ కారు ముందుకు సాగుతుంది. ట్రాఫిక్‌ జంక్షన్‌ ఎదురైతే ఎరుపు రంగు లైట్‌ కనిపించగానే కారు ఆగిపోతుంది. ఆకుపచ్చ రంగు కనిపించగానే స్టార్ట్ అవుతుంది. పసుపు రంగు లైట్‌ కనిపిస్తే కారు వేగాన్ని ఆటోమెటిగ్గా తగ్గిస్తుంది. అయితే, తాజాగా జోర్డాన్‌ నెల్సన్‌ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా.. తన కారులోని కెమెరా సెన్సార్లు రోడ్డుకు ఎదురుగా ఆకాశంలో కనిపించే చంద్రుడిని చూసి పసుపు రంగు లైట్‌గా గుర్తిస్తున్నాయి. చంద్రుడు కనిపించగానే పసుపు రంగు ట్రాఫిక్‌ లైట్‌ అనుకొని కారు వేగం తగ్గిపోతుంది. దీనికి సంబంధించిన వీడియోను జోర్డాన్‌ ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎలన్‌మస్క్‌ను ట్యాగ్‌ చేశాడు. ప్రస్తుతం జోర్డాన్‌ పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. లక్షల మంది ఆ వీడియోని చూస్తూ ఇదేం టెక్నాలజీరా బాబూ అనుకుంటున్నారు. తన కారులోనూ ఇలాంటి సమస్యే ఎదురైందని మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. మరికొందరు ఆటోపైలట్‌ మోడ్‌లో ఉపయోగించిన ఆల్గరిథమ్‌లో లోపం వల్ల ఇలా జరుగుతుందని కారణం వివరిస్తున్నారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని