Viral video: పెళ్లికొడుకు ఏడ్చాడు..!
close

Published : 14/07/2021 23:50 IST
Viral video: పెళ్లికొడుకు ఏడ్చాడు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లిలో సాధారణంగా అప్పగింతల సమయంలో వధువు భావోద్వేగానికి గురై ఏడవటం చూసుంటాం. కానీ ఓ వరుడు..  కాబోయే భార్యను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. తన ప్రేయసి దరి చేరుతున్న వేళ అతడి మనసు పరవశించింది.  గుండె నిండా ఆమెపై నింపుకొన్న ప్రేమ అతడి కన్నీటి రూపంలో బయటికొచ్చింది. ఈ మధురమైన సన్నివేశాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

వీడియోలో.. ఓ పెళ్లి వేడుకలో వధువు కోసం వరుడు వేచి చూస్తున్నాడు. అందంగా ముస్తాబైన వధువు కల్యాణ వేదిక వైపు నడుచుకుంటూ రావడం చూసి వరుడు భావోద్వేగానికి గురయ్యాడు. మనసులో ఆమెపై ప్రేమ ఉప్పొంగటంతో అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటిని తుడుచుకుంటూ ఆమె వైపు చూశాడు. అంతే అతడిని చూసి వధువు సైతం కన్నీటిపర్యంతమైంది. వేదికపైకి రాగానే తన కోసం ఎదురుచూస్తున్న వరుడిని కౌగిలించుకొని అతడి కన్నీరు తుడిచింది. మనసు నిండా ఒకరిపై మరొకరు ప్రేమను నింపుకొన్న ఆ జంటను చూసినవారంతా కామెంట్లతో వారిని హృదయపూర్వకంగా దీవిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను 74 వేల మందికి పైగా వీక్షించారు. 8580 మంది లైక్‌ చేశారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని