Viral: బాటిలెత్తి మద్యం సేవించిన వానరం
close

Published : 15/07/2021 22:15 IST
Viral: బాటిలెత్తి మద్యం సేవించిన వానరం

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లాలో ఒక మద్యం దుకాణంలో కోతి హల్‌చల్‌ చేసింది. షాపులోకి ప్రవేశించిన కోతి మద్యం సీసా మూతను నోటితో తొలగించే ప్రయత్నం చేసింది. దుకాణం యజమాని బిస్కెట్‌ పెడుతున్నా తీసుకోకుండా.. మద్యం సీసా మూతను తీయడంలో నిమగ్నమైపోయింది. ఎలాగైతేనేం.. చివరకు సీసా మూతను తొలగించి మద్యాన్ని సేవించింది. దుకాణం దగ్గరకు వచ్చిన కొంతమంది కోతి విచిత్రమైన తీరును తమ కెమేరాల్లో బంధించారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు  సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని