Viral video: వ్యక్తి చేతుల్లోంచి ఫోన్‌ను ఎత్తికెళ్లిన చిలుక.. ఏం చేసిందంటే..?
close

Published : 27/08/2021 23:05 IST
Viral video: వ్యక్తి చేతుల్లోంచి ఫోన్‌ను ఎత్తికెళ్లిన చిలుక.. ఏం చేసిందంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ వ్యక్తి దగ్గర నుంచి సెల్‌ఫోన్‌ను చిలుక ఎత్తికెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫోన్‌ కెమెరా ఆన్‌లో ఉండడం.. చిలుక ఎగురుతున్నా కూడా అది రికార్డు అవ్వడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఓ వ్యక్తి ఫొటోలు తీసుకుంటుండగా అతడి చేతుల్లోంచి మొబైల్‌ను చిలుక ఎత్తుకెళ్లింది. కంగారుపడిన ఆ వ్యక్తి ఫోన్‌ కోసం చిలుక వెంట పరుగెత్తాడు. అయితే, అది దొరకపోగా చాలా ఎత్తుకు ఎగిరిపోయింది. ఆ ఫోన్‌ కెమెరా ఆన్‌లో ఉండడంతో పైకెగిరిన ఆ చిలుక నగరం మొత్తాన్ని వీడియో తీసింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ ఫోన్‌ను చిలుక ఎక్కడ పడేసింది? ఆ తర్వాత అది ఎలా దొరికింది? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని