Viral Video: వానరం కష్టాలు
close

Published : 03/06/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Viral Video: వానరం కష్టాలు

హైదరాబాద్‌: మహబూబాబాద్‌లో ఓ కోతి తల చెంబులో ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్‌ అయ్యింది.  చెంబు తీయటానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో తల్లి కోతి తల్లడిల్లిపోయింది. ఏం చేయాలో తెలియక పిల్ల కోతిని ఎత్తుకొని తిరిగిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. స్థానికులు ఆ పిల్ల కోతి తలనుంచి చెంబును తీయటానికి ప్రయత్నించినా వారిని తల్లి కోతి దగ్గరకు రానివ్వకపోవటంతో ఏం చేయలేకపోయారు. మూడు రోజులుగా పట్టణంలోని వెంకటేశ్వర బజార్‌లో ఆ వానరం తిరుగుతున్నట్లు స్థానికులు తెలుపగా, ఎలాగైనా చెంబుని తీసి కోతికి ఉపశమనం కలిగించాలని నెటిజన్లు కోరుతున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు