
ఇంటర్నెట్ డెస్క్: వసంత పంచమి సందర్భంగా అమెరికా, భారత్‌లకు చెందిన సైనికులు చేసిన భారతీయ నాట్యం నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లో ఇరుదేశాలు సంయుక్తంగా ‘యుద్ధ్ అభ్యాస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన వసంత పంచమి పర్వదినం సందర్భంగా జరుపుతున్న వేడుకలకు అమెరికన్ సైనికులను ఆహ్వానించారు. వీటిలో హాజరయేందుకు వారు భారత సంప్రదాయ దుస్తులు ధరించి మరీ వచ్చారు. అనంతరం పంజాబీ పాటలకు అనుగుణంగా భారతీయ సైనికులతో కలసి లయబద్ధంగా నాట్యం చేశారు. ఐతే వీరందరూ మాస్కులను ధరించటం మాత్రం మర్చిపోకపోవటం ప్రశంసనీయం.
కాగా ఈ వేడుగలకు తమను ఆహ్వానించినందుకు అమెరికన్ సైనికులు కృతజ్ఞతలు తెలుపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘‘హ్యాపీ బసంత్ పంచమి’’ అంటూ అమెరికా రక్షణ సంస్థ బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ ఎఫైర్స్ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. మరి వారి స్టెప్పులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మీరే చూడండి!
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్