Viral Video: బామ్మ స్వయంకృషి..!
close

Published : 31/07/2021 22:21 IST
Viral Video: బామ్మ స్వయంకృషి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసు ఎంతైతేనేం.. తన సొంత కష్టంతో జీవించాలనేది ఆ బామ్మ తత్వం. 80 ఏళ్లు పైబడిన వయసులోనూ అమృత్‌సర్‌కు చెందిన ఓ బామ్మ సొంతంగా జ్యూస్‌ వ్యాపారం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. నగరంలోని రాణీ దా బాగ్ ప్రాంతంలో ఎస్బీఐ బ్యాంకు ఎదుట బత్తాయి రసం విక్రయిస్తోంది.  ఆమె చకచకా బత్తాయి రసం తీసి కస్టమర్లకు చిరునవ్వుతో అందిస్తున్న వీడియోను ఓ ఫుడ్‌ బ్లాగర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ వయసులో ఆమె స్వయంకృషికి ఫిదా అయిన నెటిజన్లు ట్విటర్‌లోనూ ఆ వీడియోను షేర్ చేస్తుండటంతో అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 90 లక్షల మంది వీక్షించగా.. 11 లక్షల మందికి పైగా లైక్‌ చేశారు. వీడియోలో బామ్మ కష్టాన్ని చూసిన చాలామంది భావోద్వేగంతో స్పందిస్తున్నారు. కొందరు సహాయం చేసేందుకు ఆమె బ్యాంకు ఖాతా వివరాలనూ కోరుతున్నారు. స్థానిక ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆమెకు తగిన సహాయం చేయాలని మరికొందరు కోరుతున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని