close

Published : 27/02/2021 21:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్యాట్‌ వాక్ కాదిది.. కౌ వాక్‌!!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాషన్‌ రంగంలో అమ్మాయిలు క్యాట్‌వాక్‌ చేస్తూ అలా వస్తుంటే అక్కడున్న వారు ఇట్టే ఆకర్షితులైపోతారు. మనలోనూ ఎవరైనా కాస్త వయ్యారంగా నడిచినా క్యాట్‌ వాక్‌ చేస్తున్నావా అంటూ ఆటపట్టిస్తారు. క్యాట్‌వాక్‌కున్న క్రేజ్‌ అది. కానీ ఆ క్యాట్‌ వాక్‌ను తలదన్నే కౌ వాక్‌ను మీరెప్పుడైనా చూశారా? లేకపోతే ఈ వీడియో చూసేయండి. ఓ ఆవు వయ్యారంగా నడుస్తున్న ఐదు సెకన్ల వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి 2018లోనే పాల ఉత్పత్తులను తయారు చేసే ఓ సంస్థ ఈ వీడియోను షేర్‌ చేసింది. 8 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు వీక్షించిన ఈ వీడియో తాజాగా మళ్లీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. కొందరు మోడల్స్‌ కంటే చక్కగా నడుస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు