Viral Video: రెండు తలల పామును చూశారా!
close

Published : 27/07/2021 00:02 IST
Viral Video: రెండు తలల పామును చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గర్భంలోని పిండం రెండుగా విడిపోవడం వల్ల కవలలు ఏర్పడతారు. ఒక్కోసారి ఆ పిండం విడిపోవడం మధ్యలోనే ఆగిపోతుంటుంది. అలాంటపుడు అవిభక్త కవలలు తయారవుతారు. కొన్ని సందర్భాల్లో పాములు గుడ్లను పొదిగేటపుడు కూడా ఇలా జరగుతుంటుంది. అండం, పిండదశలోకి వచ్చినపుడు రెండుగా విడిపోకుండా ఉండటం వల్ల రెండు తలల పాము జన్మించే అవకాశం ఏర్పడుతుంది. ఆవిధంగా పుట్టిన రెండు తలలున్న పాము ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

ముదురు గోధుమ, లేత పసుపు రంగు చారలతో కనిపిస్తోన్న ఈ పాము పేరు బెన్‌ అండ్‌ జెర్రీ. ఇది కాలిఫోర్నియా కింగ్‌ స్నేక్‌ జాతికి చెందిన పాము. రెండు తలలతో రెండు ఎలుకలను నోటకరిచి వాటిని తినడానికి ప్రయత్నిస్తున్న వీడియోను బ్రియాన్‌ బార్జిక్‌ అనే ఔత్సాహికుడు, వ్లాగర్‌ తన ఇన్‌స్టాగ్రాం ఖాతా స్నేక్‌బైట్స్‌ టీవీ ద్వారా పంచుకున్నారు. అది కాస్తా నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. కాగా రెండు తలల పామును ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని