
ముంబయి: ప్రతిష్టాత్మక మిస్ ఇండియా 2020 రన్నరప్ కిరీటాన్ని గెల్చుకున్న మాన్యా సింగ్.. వివిధ కారణాలతో పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. ఓ ఆటో డ్రైవర్ కుమార్తెగా.. వేరేవారికి అసాధ్యమైన దాన్ని తన పట్టుదల, కృషితో ఈమె సాధించారు. కాగా, మాన్యకు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో తళుక్కున మెరిసి.. ప్రపంచం తల తిప్పి చూసేలా చేసుకున్న మాన్య చేసిన పనికి ప్రపంచం మరోసారి జోహార్ అంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
తాను చదువుకున్న ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాల యాజమాన్యం మాన్యాసింగ్కు సన్మానాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందు సంగతి ఎలాఉన్నా, మిస్ ఇండియా రన్నరప్ అయిన అనంతరం ఆమె హోదా, అంతస్తు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కానీ అవేమీ పట్టించుకోని మాన్య ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏ మాత్రం సంకోచం లేకుండా తండ్రి ఆటోను నడుపుతుండగా.. తన తల్లితో సహా ముంబయి వీధుల్లో ప్రయాణించింది. ఆటో దిగిన అనంతరం నడిరోడ్డు మీదే తన తల్లితండ్రుల కాళ్లకు నమస్కరించింది. దీనిని చూసిన నెట్ ప్రపంచం.. ‘ఏ హై ఇండియా మేరీ జాన్!’ అంటోంది. ఈ సందేశాత్మక వీడియోను మీరూ చూడండి.
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్