తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడ్డ మహిళ
close

Published : 15/07/2021 14:58 IST
తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడ్డ మహిళ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌ గాజియాబాద్‌లో ఓ మహిళ తొమ్మిదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రమాద సమయంలో బాల్కనీలో ఉన్న ఓ వ్యక్తి మహిళను రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ రెప్ప పాటులో ఆ మహిళ కింద పడిపోయింది. ఈ క్రమంలో మహిళకు తీవ్రగాయాలు కాగా ఆమెకు నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే మహిళ కిందికి దూకిందని అపార్ట్‌మెంట్‌వాసులు చెబుతున్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తరువాతే మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని