
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వల్ల చాలా మంది ఉద్యోగులు, అధికారులు ఇంటి నుంచి లేదా జూమ్ యాప్‌లో తమ విధులను నిర్వహిస్తున్నారు. అలా ఓ వ్యక్తి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా.. తన భార్య ముద్దుపెట్టబోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇంతకీ వీడియోలో ఏముందంటే... భర్త వీడియో కాన్ఫరెన్స్‌లో సీరియస్‌గా జీడీపీ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భార్య ఒక్కసారిగా గదిలోకి వచ్చి ఆయనకు ముద్దుపెట్టడానికి ప్రయత్నించింది. దీంతో ఆయన కోపంగా ఆమె వైపు చూసి, స్క్రీన్ ముందుకు ముఖం తిప్పారు. అప్పుడు ఆయన కాల్ సంభాషణలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేయగా, మరో వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘ఈ సంవత్సరానికి గానూ ఆ యువతిని ఉత్తమ భార్యగా నేను నామినేట్ చేస్తున్నా. భర్త మరింత సంతోషంగా ఉండి ఉంటే వారిని కపుల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం నామినేట్ చేసేవాడిని’ అని గోయెంకా ట్వీట్‌కు మహీంద్రా రీట్వీట్ చేశారు.
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్