Viral video: వర్క్‌ ఫ్రమ్‌ పెళ్లిపీటలు.. అక్కడా తప్పని ఆఫీసు పని
close

Published : 24/07/2021 14:10 IST
Viral video: వర్క్‌ ఫ్రమ్‌ పెళ్లిపీటలు.. అక్కడా తప్పని ఆఫీసు పని

మహమ్మారి కరోనా వల్ల ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. హడావుడిగా ఆఫీసుకు పరుగులు తీసేవారికి.. వైరస్‌ పుణ్యమా అంటూ ఇంట్లో వాళ్లతో గడిపే సమయం కాస్త దొరికింది. అయితే.. ప్రారంభంలో ఇంటి నుంచి పనే బాగానే అనిపించినప్పటికీ.. క్రమంగా అందులోని కష్టాలు అర్థమయ్యాయి. ఇక వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వరకూ అయితే ఒకే.. కానీ వర్క్‌ ఫ్రమ్‌ పెళ్లిపీటలు అయితే... ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే నవ్వు ఆగకమానదు.

చుట్టూ పెళ్లి వాతావరణం..  కుటుంబసభ్యులు, అతిథులందరూ వరుడితో పెళ్లిపనులు ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురుచూస్తుంటే.. వరుడేమో ఆఫీస్‌ పని కారణంగా ల్యాప్‌టాప్ పై పనిచేయడం.. అది చూసి వధువు నవ్వడం.. ఇవన్నీ వైరల్‌గా మారాయి. మహారాష్ర్టలో జరిగిన ఈ వివాహ వేడుకను దుల్హనియా అనే ఇన్‌స్టా పేజీలో షేర్‌ చేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని