close

వార్తలు / కథనాలు

అక్కడ పర్యాటకుల్ని పెళ్లిచేసుకోవచ్చు కానీ..

ఒక్కరోజుకే..

ఆమ్‌స్టర్‌డ్యాం: ఒక్క రోజు కోసమే అయితే ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకు.. అనుకుంటున్నారా? నెదర్లాండ్స్‌ పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం ఇది. అసలు విషయం ఏంటంటే.. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యాం నగరంలో జనాభా సంఖ్య పది లక్షలే. కానీ, ఈ నగరానికి ప్రస్తుతం వస్తున్న పర్యాటకుల సంఖ్య మాత్రం 19 మిలియన్లు దాటుతోంది. మరో పదేళ్లలో ఈ సంఖ్య 29 మిలియన్ల మార్క్‌కు దాటనుంది. దాంతో తమ ప్రాంతంలోకి పర్యాటకులు ఎక్కువైపోతున్నారని, ఇది ఓవర్‌ టూరిజంకు దారితీస్తోందిన స్థానికులు చింతిస్తున్నారట. దాంతో అటు పర్యాటకుల్లో ఇటు స్థానికుల్లో పాజిటివిటీని కలిగించేలా ‘అన్‌ టూరిస్ట్‌ గైడ్‌ టు ఆమ్‌స్టర్‌డ్యాం’ పేరిట పర్యాటక శాఖ ఒక్క రోజు పెళ్లి అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. 

అంటే పర్యాటకులు స్థానికుల్లో ఒకరిని పెళ్లిచేసుకోవచ్చు. వారితోనే నగరం మొత్తం చుట్టి రావచ్చు. ఇలాంటి జంటలకు హనీమూన్‌ ప్యాకేజీలను కూడా కల్పిస్తున్నాయి. అయితే ఇది నిజమైన పెళ్లి మాత్రం కాదు. డెబోరా అనే పర్యాటకురాలు ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్న కథనంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

‘ఆమ్‌స్టర్‌డ్యాం నగరాన్ని చుట్టిరావడానికి నాకంటూ ఓ తోడు ఉండాలని ఒక్కరోజు పెళ్లికి ఒప్పుకొన్నాను. అక్కడి స్థానికుడిని పెళ్లి చేసుకున్నాను. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒక రోజు తర్వాత వారికి గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోవచ్చు. నచ్చితే వారిని లీగల్‌గా పెళ్లి చేసుకుని వారితోనే ఉండిపోవచ్చు’ అని వెల్లడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న