close

వార్తలు / కథనాలు

సంద్రం అడుగున స్వర్ణం.!   

సంద్రం అడుగున స్వర్ణం.! 
 

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: 113ఏళ్ల క్రితం రష్యా, జపాన్‌ల మధ్య ఒక యుద్ధం జరిగింది. 133బిలియన్‌ డాలర్ల విలువ 200టన్నుల బంగారంతో వెళుతున్న రష్యాకు చెందిన డొంక్సోయి నౌకను చేజిక్కించుకునేందుకు జపాన్‌ విఫలయత్నం చేసింది. అందులో ఉన్న 60 మంది నావికులను చంపేసింది. ఎలాగైనా బంగారాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ఆ నౌకలో అల్లకల్లోలం సృష్టించింది. పరిస్థితి చేజారిపోతుండటంతో ఆందోళనకు గురైన నౌక కెప్టెన్‌ ఇవాన్‌ నౌకను జపాన్‌ ఆధీనంలోకి వెళ్లకుండా చేయాలనుకున్నాడు. నౌకను వేగంగా నడిపించాడు. అప్పటికే యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆ నౌక నీటిలో మునిగిపోయింది. ఆ నౌక కోసం ఎన్నో ఏళ్ల నుంచి వెతుకులాటలు జరుపుతున్నప్పటికీ దాని జాడ ఎవ్వరికీ తెలియలేదు. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన బృందం నిర్వహించిన అన్వేషణలో ఆ నౌక ఆచూకీ లభించింది. అంతే అందులో ఉన్న బంగారం కోసం పోరు మొదలైంది. దానిపై సర్వాధికారాలు మాకుంటాయంటే మాకుంటాయంటూ రష్యా, దక్షిణ కొరియాలు వాదిస్తున్నాయి.

దక్షిణ కొరియాకు ఒక మైలు దూరంలో ఓ చిన్న ద్వీపానికి సమీపంలో నీటి అడుగున డొంక్సోయి ఉన్నట్లు సియోల్‌కు చెందిన బృందం గుర్తించింది. దాదాపు 6,200టన్నుల బరువైన మిత్రీ డోంస్కోయిని ఈతగాళ్లు గుర్తించినట్లు ప్రకటించింది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది. సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో బంగారం ఉన్నట్లు.. 1905లో రష్యా, జపాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆ నౌక మునిగిపోయినట్లు తెలిపింది. నౌకపై రష్యా భాషలో పేర్లు కనిపిస్తున్నాయి. ఆ నౌకపై పూర్తి అధికారం మాకే ఉంటుందని రష్యా వాదిస్తోంది. సముద్రంలో ఉన్న నౌకను కనిపెట్టడం అంత సులభమైన పనికాదు కాబట్టి దానిపై మాకే హక్కులుంటాయని దక్షిణ కొరియా వాదిస్తోంది. నౌక శిథిలాలను బయటికి తీసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. అందులో ఉన్న బాక్సులను తెరిచేందుకు ఈతగాళ్లు ఎంత ప్రయత్నించినా ఇప్పటివరకూ తెరవలేకపోయారు. నౌకను దాదాపు వెయ్యి అడుగుల కింద ఉన్నట్టు తెలుస్తోంది. ఉంది. నీటిలో ఉన్న నౌకలో కొన్ని డబ్బాలు ఉన్నట్లు గుర్తించారు. నౌక శిథిలాలను బయటికి తీసుకొచ్చేందుకు చైనా, కెనడా, యూకేలకు చెందిన సంస్థల సహాయంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బాల్లో నిజంగా బంగారం ఉందా లేదా అనే విషయం తెరిస్తే గానీ స్పష్టం కాదు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు