close

వార్తలు / కథనాలు

అప్పుడు సోఫియా.. ఇప్పుడు రష్మ

హ్యుమనాయిడ్‌ రోబోను తయారు చేసిన రాంచీ యువకుడు

అప్పుడు సోఫియా.. ఇప్పుడు రష్మ

రాంచీ: హ్యుమనాయిడ్‌ రోబో ‘సోఫియా’ గుర్తుండే ఉంటుంది. హాంకాంగ్‌కు చెందిన హాన్‌సన్‌ రోబోటిక్స్‌ సంస్థ దీన్ని అభివృద్థి చేసింది. అయితే, ఇప్పుడు మనదేశానికి కూడా ఓ సోఫియా వచ్చేసింది. అదేనండీ రోబో. దానిపేరు రష్మి. రాంచీకి చెందిన రంజిత్‌ శ్రీవాస్తవ దీన్నితయారు చేశారు. హాంకాంగ్‌లోని ఓ సంస్థకు చెందిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా దీన్ని తయారు చేశారు. ఈ రోబో హిందీ, భోజ్‌పురి, మరాఠీ, ఇంగ్లీష్‌ మాట్లాడగలదు. చిత్రంగా ఉంది కదూ.. మరి దీన్ని విశేషాలు..!

ప్రత్యేకతలు
* ప్రపంచంలోని సోషియల్‌ హ్యుమనాయిడ్‌ రోబోల్లో కెల్లా హిందీ మాట్లాడగల ఏకైక రోబో రష్మి. ఇది నాలుగు భాషలు మాట్లాడగలదు. 
* ఇందులో లింగ్విస్టిక్‌ ఇంటర్‌ప్రిటేషన్‌(ఎల్‌ఐ), కృతిమమేధ(ఏఐ), విజువల్‌ డేటా, ఫేసియల్‌ రికగ్నిషన్ సిస్టమ్‌ ఉంటాయి.
* దీన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 
* దీనికి మానవరూపం అంటే ముఖం, తల, శరీరం ఆకృతి తెప్పించడానికి కేవలం 30రోజులు పట్టింది.
* కళ్లు, పెదాలు, కనుబొమ్మలను కదిలిస్తూ ఇది మాట్లాడగలదు.
* అవతలి వ్యక్తి మాట్లాడే మాటలను లింగ్విస్టిక్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ ద్వారా విశ్లేషించుకుని కృత్రిమ మేధ ద్వారా సమాధానం చెబుతుంది.

దీనిపై ఈ రోబోను తయారు చేసిన రంజిత్‌ మాట్లాడుతూ... ‘‘ఈ హ్యుమనాయిడ్‌ రోబో భవిష్యత్‌ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒంటరిగా భావించే వాళ్లకు ఇలాంటి రోబోలు తోడుగా ఉంటాయి. ‘నీకు ఇష్టమైన హీరో ఎవరు?’ అని అడిగితే ‘షారుఖ్‌ ఖాన్‌’ అని బదులిస్తుంది. ఇందులో అమర్చిన ప్రత్యేక కెమెరాల ద్వారా ఎదుటి వ్యక్తి ముఖాన్ని కాప్చర్ చేసి గుర్తు పెట్టుకుంటుంది. పదిహేను సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసిన నాకు దీన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. 2016 జులైలో దీన్ని తయారు చేయడం మొదలు పెట్టాను. హాంకాంగ్‌లో ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో దీన్ని రూపొందించాను’’ అని తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు