Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

మేకప్‌ మాయ.. చూడండయా..!

మేకప్‌ మాయ.. చూడండయా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అందంగా కన్పించడం కోసం మేకప్‌ వేసుకోవడం సాధారణమే. సినిమాల్లో హీరోలు, హీరోయిన్లకు మేకప్‌ వేసి వారిని మరింత అందంగా చూపిస్తారు. కొన్నిసార్లు పాత్ర కోసం ప్రొస్థటిక్‌ మేకప్‌ వేసి వారిని బామ్మలు, తాతయ్యలుగా చూపిస్తుంటారు. ‘భారతీయుడు’ సినిమాలో కమల్‌హాసన్‌, సుకన్యలు అలా కన్పించినవారే. ఇప్పుడు ఈ మేకప్‌ గోల అంతా ఎందుకు అంటే.. చైనాకు చెందిన ఓ యువతి మేకప్‌ వేసుకున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మేకప్‌ తర్వాత ఆ యువతి గుర్తుపట్టలేనంతగా పూర్తిగా మారిపోయింది.

చైనాకు చెందిన కి హువావా తన మేకప్‌ వీడియోతో ఒక్కరోజులోనే సోషల్‌మీడియాలో సెన్సేషన్‌ అయ్యింది. ఫౌండేషన్‌, లెన్సెస్‌, లిప్‌స్టిక్‌ వంటివాటితో ప్రొస్థటిక్‌ మేకప్‌ వేసుకుని హువావా పూర్తిగా మారిపోయింది. ఈ వీడియోలో ఆమె మేకప్‌ వేసుకోవడం, తొలగించడం కూడా ఉంది. హువావా మేకప్‌ వీడియో ముందు చైనీస్‌ వీడియో ప్లాట్‌ఫాం యుకులో విడుదలైంది. ఆ తర్వాత 9గ్యాగ్ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. శుక్రవారం ఈ వీడియోను పోస్టు చేయగా.. ఇప్పటికే 20లక్షల మందికి పైగా చూసేశారు. వేల కొద్ది లైక్‌లు, షేర్‌లు చేశారు.

వీడియోను చూసిన వారంతా ఇందులో ఉన్నది ఒకే అమ్మాయా? అని ఆశ్చర్యపోతున్నారు. కొందరు హువావా మేకప్‌ నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ‘ఏమిరా.. ఈ మేకప్ మాయా’ అని అనుకోవడం ఖాయం. మరింకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు