close

వార్తలు / కథనాలు

ఇది ప్రపంచంలోనే అత్యంత బుల్లి దొంగ!

ఇది ప్రపంచంలోనే అత్యంత బుల్లి దొంగ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా చీమల గురించి మనకు మంచి అభిప్రాయమే ఉంటుంది. వాటిని చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలంటారు పెద్దలు. మరి అంతటి మంచి లక్షణం కలిగిన చీమలకు మరో గొప్ప శక్తి కూడా ఉంది. వాటి శరీర బరువు కంటే దాదాపు 10రెట్లు బరువున్న వస్తువులను కూడా అవి మోయగలవు. ఎక్కడెక్కడో ఉన్న ఆహారాన్ని వాటి స్వస్థలాలకు తెచ్చుకోవాలంటే ఆమాత్రం బలం ఉండాలి కదా!. మరి ఇలాంటి చీమే ఒకటి ఆభరణాల షాపులోకి దూరింది. అక్కడ ఉన్న చిన్న చిన్న వజ్రాలను చూసి తినుబండారం అనుకుందో ఏమో అందులోని ఓ చిన్న వజ్రాన్ని అతి కష్టం మీద మోసుకొస్తూ కెమెరా కంట్లో పడింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.దాదాపు రూ.10లక్షల విలువైన ఆ వజ్రాన్ని ఈ చీమదొంగ ఎలా మోసిందో చూసేయండి!


Tags :

మరిన్ని