close

వార్తలు / కథనాలు

దూకనన్నా కూడా బ్రిడ్జ్‌పై నుంచి తోసేసింది!

దూకనన్నా కూడా బ్రిడ్జ్‌పై నుంచి తోసేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని సార్లు సరదాగా చేసిన పనులు చేదు అనుభవాన్ని మిగుల్చుతాయి. అలాంటి ఘటనే అమెరికాలోని వాషింగ్టన్‌లో చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ యువతి తీవ్ర గాయాలపాలైంది.

జోర్డాన్‌ హోల్గెర్సన్‌(16) స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. సమీపంలోని కాలువ వద్ద అందరూ స్నానాలు చేద్దామని సిద్ధమయ్యారు. స్నేహితులతో కలిసి జలకాలాడదామని జోర్డాన్‌ కూడా బికినీ వేసుకొని వచ్చింది. సరదాగా కాలువపై ఉన్న బ్రిడ్జ్‌ మీద నుంచి నీళ్లలోకి దూకాలని అనుకున్నారు. జోర్డాన్‌ కూడా ఒక అడుగు ముందుకు వేసింది. ఆ సమయంలో పక్కన ఉన్న వ్యక్తి అంకెలు లెక్క పెడుతూ ‘దూకడానికి సిద్ధంగా ఉన్నావా?’ అని జోర్డాన్‌ను అడిగితే, ‘లేను’ అని బ్రిడ్జ్‌పై నుంచి దూకడానికి తటపటాయిస్తున్న సమయంలో వెనుక నుంచి ఓ యువతి ఆమెను తోసేసింది. 20 మీటర్ల ఎత్తున్న బ్రిడ్జ్‌పై నుంచి నీటిలోకి పడిపోవడంతో జోర్డాన్‌ పక్కటెముకలు విరిగిపోయాయి. దీంతో సరదా విహారయాత్ర కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

‘అదృష్టవశాత్తూ ఆమె పక్షవాతానికి గురవడం లేదా చనిపోవడం కానీ జరగలేదు. దెబ్బలు బాగానే తగిలాయి. త్వరగా కోలుకుంటోంది.’ అని జోర్డాన్‌ తల్లి జెనిల్లీ భోరున విలపించింది. అయితే, ఆ బ్రిడ్జ్‌పై నుంచి దూకడం చట్ట విరుద్ధమని, ఇలాంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు