close

వార్తలు / కథనాలు

ఈ స్వీట్‌ కేజీ రూ.9వేలు!

ఈ స్వీట్‌ కేజీ రూ.9వేలు!

సూరత్‌(గుజరాత్‌): కేజీ స్వీట్స్‌ ధర ఎంతుంటుంది? మహా అయితే రూ.500 నుంచి రూ.600 వరకూ ఉంటుంది. స్వచ్ఛమైన నేయి, జీడిపప్పుతో చేసిన స్వీట్స్‌ అయితే కిలో రూ.1000 దాకా ఉండొచ్చు. కానీ, సూరత్‌లోని ఓ స్వీట్ షాపులో విక్రయిస్తున్న స్వీట్‌ ధరెంత తెలుసా? కిలో రూ.9వేలు. అంత ధరా! అని ఆశ్చర్యపోకండి.

త్వరలో రక్షాబంధన్‌ వేడుకను పురస్కరించుకుని సూరత్‌లోని ఓ మిఠాయి దుకాణం ఈ ఖరీదైన స్వీట్‌ను తయారు చేసింది. ఈ స్వీట్‌కు ఇంత ధర పెట్టడానికి ప్రధాన కారణం దానిని బంగారు పూతతో చేయడమే. సాధారణంగా సిల్వర్‌ పూత పూసిన వాటిని కేజీ రూ.300 నుంచి రూ.500 వరకూ విక్రయిస్తారు. కానీ, ఈ స్వీట్‌పై 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని పూతగా పూశారు. దీంతో ఇది ‘గోల్డ్‌ స్వీట్‌’ అంటూ వార్తల్లోకి ఎక్కింది.

ఈ స్వీట్‌ కేజీ రూ.9వేలు!

ఇంత ధర పెట్టి ఎవరు కొంటారు? అని అనుకోవద్దు. తమ దుకాణానికి వస్తున్న వినియోగదారుల నుంచి ‘గోల్డ్‌ స్వీట్‌’కు స్పందన బాగానే ఉందని దుకాణ యజమాని చెబుతున్నారు. ఈ స్వీట్స్‌తో తమ దుకాణానికి మరింత ప్రచారం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.