close

వార్తలు / కథనాలు

ప్రకృతికి మనం ఇచ్చిన కానుకలు తిరిగిచ్చేసింది

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఫొటో

ప్రకృతికి మనం ఇచ్చిన కానుకలు తిరిగిచ్చేసింది

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గెంటితే గేటు కూడా డబుల్‌ స్పీడ్‌లో వస్తుంది’ అన్నది ఓ సినిమాలో డైలాగ్‌! కరెక్టే మరి.. ప్రకృతికి విరుద్ధంగా మనం ఏం చేస్తామో.. అంతకు మించిన వైపరీత్యాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం. నేటి కాలంలో సంభవించే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు సగం కారణం మానవ తప్పిదాలే. ఈ విషయం తాజాగా కేరళలో నిరూపితమైంది. భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది. గత వందేళ్లలో ఎప్పుడూ రాని ఉపద్రవం అక్కడి ప్రజలకు కన్నీళ్లను మిగిల్చింది. ఆ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రపంచదేశాలు సైతం ఆపన్నహస్తాన్ని అందిస్తున్నాయి.

కేరళలో గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నీటి ఉద్ధృతి క్రమంగా తగ్గింది. అనంతరం ఓ వంతెనపై నెలకొన్న పరిస్థితి ఇది (చిత్రంలో). చూశారుగా.. విరిగిన కొమ్మలను పక్కన పెడితే ఫొటోలో ఎక్కువగా మనకు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు, చెప్పులే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయడం.. చెరువులను, కాలువలను ఆక్రమించి భవనాలు నిర్మించడం వంటి మానవ తప్పిదాల వల్ల.. భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు పోయే దారిలేక ఇళ్లను ముంచెత్తున్నాయి. అలా పడేసిన చెత్త.. వరద నీటికి ఇలా కొట్టుకు వచ్చి, వంతెనపై ఉండిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.


Tags :

మరిన్ని