close

వార్తలు / కథనాలు

చిన్నారి ఆకలి తీర్చిన పోలీసు అధికారిణి 

నెట్టింట్లో ఫొటోవైరల్‌ 

చిన్నారి ఆకలి తీర్చిన పోలీసు అధికారిణి 
 

ఇంటర్నెట్‌ డెస్క్‌: తల్లిబిడ్డల అనుబంధాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. తల్లిగర్భంలో నుంచి భూమి మీదకు వచ్చిన తరువాత ఏ బిడ్డకయినా తొలుత అమ్మతోనే అనుబంధం మొదలవుతుంది. తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏపని చేస్తున్నా బిడ్డ అవసరాలను గుర్తించగలదు. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. కలెక్టరయినా, కానిస్టేబుల్‌ అయినా ఓ బిడ్డకు తల్లే. అయితే, ఇటీవల అర్జెంటీనాలో ఆ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గస్తీ నిర్వహించడానికి వచ్చిన పోలీసు అధికారిణికి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. అంతే ఆమెలోని అమ్మతనం ప్రోటోకాల్‌, నిబంధనలు కాదని ఆ బిడ్డకు పాలిచ్చేలా చేసింది.

అర్జెంటీనాలోని బెర్రిసో ప్రాంతంలోని చిన్నపిల్లల ఆసుపత్రిలో గస్తీ నిర్వహించడానికి వచ్చిన సెలస్టే జాక్వెలిన్‌ అయాలా అనే పోలీసు అధికారిణికి అక్కడ ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ చిన్నారి ఆకలితో ఉందని గ్రహించిన జాక్వెలిన్‌ ప్రొటోకాల్‌, నిబంధనలు పక్కన పెట్టి మరీ వెళ్లి ఆ చిన్నారికి పాలు పట్టింది. అంతే, జాక్వెలిన్‌ రియాక్షన్‌ చూసి అవాక్కవ్వడం అక్కడున్న వారి వంతైంది.

వెంటనే ఆమె పాలు పడుతున్నప్పుడు ఫొటో తీసిన మాక్రోస్‌ హెరీడియా అనే పోలీసు ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ‘జాక్వెలిన్‌లో ఉండే మంచి గుణాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అందుకే పాప ఏడుపు వినగానే తనకు తన బిడ్డ గుర్తొచ్చింది. అమ్మతనంలోని గొప్ప భావాన్ని ఈ ఫొటో మీకు తెలియజేస్తుంది’ అంటూ కామెంట్‌ పెట్టి పోస్ట్‌ చేసింది. ఈ ఫొటో కాస్త విపరీతంగా వైరల్‌ అయింది. పోస్ట్‌ చేసిన నాలుగు గంటల్లోపు లక్షల మంది దీన్ని షేర్‌ చేశారు.

ఈ ఘటన ఈనెల 14న చోటు చేసుకుంది. అదే రోజును అర్జెంటీనాలో ‘జాతీయ మహిళా అధికారుల దినోత్సవం‌’గా జరుపుకొంటారు. ఆరోజునే ఈ ఘటన జరగడం విశేషం. జాక్వెలిన్‌ పాలు పట్టిన ఆ బిడ్డకు ఇటీవలే తల్లి దూరమయింది. అప్పటినుంచి ఆ చిన్నారి పోషణ భారం ఆసుపత్రి యాజమాన్యమే చూసుకుంటోంది.

అయితే, ఈ ఒక్కఘటనతో జాక్వెలిన్‌కు ఎప్పుడూ రానంత పేరు ప్రతిష్ఠలు వచ్చిపడ్డాయి. అంతేకాదు ఈమె చేసిన పని గురించి తెలుసుకున్న పోలీసు శాఖ ఈమెపై ప్రశంసల వర్షం కురిపించి ప్రమోషన్‌ కూడా ఇచ్చింది. ఇటు నెటిజన్లు అటు అధికారుల ప్రశంసలకు జాక్వెలిన్‌ స్పందిస్తూ ‘ ఆ చిన్నారి ఏడుపు వినగానే నా బిడ్డ గుర్తొచ్చింది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నా స్థానంలో ఏ తల్లి ఉన్నా ఇలాగే చేస్తుంది’ అని బదులిచ్చింది.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.