close

వార్తలు / కథనాలు

బుద్ధుడిని చూసి బుద్ధి తెచ్చుకున్నారు!

బుద్ధుడిని చూసి బుద్ధి తెచ్చుకున్నారు!

ఓక్లాండ్‌: రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం.. ఆస్పత్రి, సినిమాహాళ్ల గోడలపై పాన్‌, గుట్కా నమిలి ఉమ్మేయడం మనం చూస్తుంటాం. ఉమ్మివేయరాదన్న చోటే ఉమ్ములు వేస్తారు. మూత్రం పోయరాదన్న చోటే ఆ పని కానిచ్చేస్తారు. కొందరు వ్యక్తులు చేసే ఇలాంటివి బాధ్యతారాహిత్య పనులు అడ్డుకునేందుకు ఆయా ప్రదేశాల్లో దేవుడి బొమ్మలు పెట్టడం మనం చూస్తుంటాం. కొన్నిచోట్ల మార్పు కనిపించినా, ఇంకొన్ని చోట్ల ఎవరికీ పట్టదు. కానీ, అమెరికాలోని ఓక్లాండ్‌ నగరంలో మాత్రం నేరాల అడ్డాగా మారిన ఓ ప్రదేశంలో పెట్టిన బుద్ధుడి విగ్రహంతో చాలామందిలో మార్పు వచ్చింది. ఏకంగా 82శాతం మేర నేరాలు తగ్గిపోవడం విశేషం. ఇంతకీ ఆ బుద్ధ విగ్రహం కథేంటంటే..

అమెరికాలోని ఓక్లాండ్‌ నగరం 11వ ఎవెన్యూ, ఈస్ట్‌ 19వ వీధి అంటే దోపిడీలు, మాదకద్రవ్యాలు, వ్యభిచార కార్యకలాపాలు, ఆకతాయిలకు అడ్డా. ఇక స్థానికులూ ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం వేసేవాళ్లు. వీటిని అడ్డుకోవడానికి ఏం చేయాలా? అని అదే ప్రాంతంలో నివసించే డాన్‌ స్టీవెన్‌సన్‌ అనుకునేవాడు. ఒకరోజు ఓ హార్డ్‌వేర్‌ షాప్‌ నుంచి బుద్ధుడి విగ్రహం తీసుకొచ్చాడు. తన ఇంటికి ఎదురుగా ఉన్న వీధి చివరిన ఆ బుద్ధుడి విగ్రహం పెడితే ఏమైనా మార్పు వస్తుందేమోనని భావించి, అక్కడే రోడ్డు పక్కనే విగ్రహాన్ని నెలకొల్పాడు. బుద్ధుడి విగ్రహం ఉండటంతో స్థానికులు ఆ ప్రాంతంలో చెత్త వేయడం మానేశారు. వియత్నాంకు చెందిన కొందరు ఆ బుద్ధ విగ్రహానికి పూలు, పళ్లు, ధూపదీపాలు సమర్పించడం మొదలెట్టారు. క్రమంగా అక్కడి ప్రదేశం మొత్తం పరిశుభ్రంగా మారింది.

బుద్ధుడిని చూసి బుద్ధి తెచ్చుకున్నారు!

అలాగే ఆకతాయిలు, వ్యభిచార ముఠాలు, దొంగలూ అక్కడికి రావడానికి సంకోచించేవాళ్లు. స్థానికంగా ఉండే వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి కుక్‌ వో స్టీవెన్‌సన్‌ని కలిసి ఆ బుద్ధ విగ్రహ బాధ్యతలు తాము తీసుకుంటామని చెప్పడంతో స్టీవెన్‌సన్‌ అంగీకరించాడు. దీంతో మెల్లగా ఆ విగ్రహానికి మందిరం కట్టారు. రోజూ పూలు, పళ్లతో అందంగా అలంకరించడంతోపాటు మందిరాన్ని, విగ్రహాన్ని అందమైన రంగులతో తీర్చిదిద్దారు. ఆ ప్రదేశం మొత్తం ఎంతో ఆహ్లాదంగా మారింది. దీంతో అక్కడి నేరాలు తగ్గుముఖం పట్టాయి. పోలీసు గణంకాల ప్రకారం.. మొత్తం 82 శాతానికి పడిపోయాయి.

ఈ విషయంపై స్టీవెన్‌సన్‌ మాట్లాడుతూ.. మొదట అక్కడ క్రీస్తు విగ్రహం పెట్టాలనుకున్నా.. కానీ, స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందేమోనని ఆలోచించి అందరికీ ఆమోదయోగ్యుడు, స్థితప్రజ్ఞుడైన బుద్ధుడిని పెట్టానని నవ్వుతూ మీడియాకు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు