close

వార్తలు / కథనాలు

హెల్మెట్‌తో చల్లని కూల్‌ కూల్‌.. !

హెల్మెట్‌తో చల్లని కూల్‌ కూల్‌.. !

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎండాకాలం.. బయట ఒకటే వేడి.. పైగా హెల్మెట్‌తో బైక్‌పై దూర ప్రయాణం. ఒక్కసారి ఆ వాహన చోదకుడి స్థానంలో మీరే ఉన్నారని ఊహించుకోండి! అదే సమయంలో పక్కనే ఏసీ కారు రయ్‌రయ్‌ మంటూ దూసుకెళుతుంటే ఎవరికైనా ఈర్ష్య పుట్టడం సహజం. బైక్‌కు కూడా ఓ ఏసీ ఉంటే ఎంత బాగున్నో.. అన్న ఆలోచనా వస్తుంది. అది నిజం ఎందుకు కాకూడదు? అలాంటి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్‌!. ఫెహెర్‌ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ ఏసీ యూనిట్‌తో ఏసీహెచ్‌-1 పేరిట ఓ హెల్మెట్‌ను రూపొందించింది.

ఈ హెల్మెట్‌ ముఖ్య లక్ష్యం మండిపోయే వాతావరణంలో వాహన చోదకుడికి చల్లదనం అందించడమే. ఒకవేళ ఏసీ వల్ల ఆ తేమ అతడి ముఖాన్ని తాకితే రోడ్డు కనిపించడం కష్టమై ప్రమాదం జరిగే ఆస్కారముంటుంది కదా? అనే అనుమానమూ రావొచ్చు. కానీ, ఇది కేవలం తల భాగాన్ని మాత్రమే చల్లబరుస్తుంది. గరిష్ఠంగా 15 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతను తగ్గించి ప్రయాణికుడికి హాయినందిస్తుంది. వర్షాకాలం వాడకపోవడం మంచిది. బైక్‌ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది.

అసలే హెల్మెట్‌.. దానికిపైగా ఏసీ అంటున్నారు.. దీని బరువెంత ఉంటుందో? అని సందేహ పడకండి. దీని బరువు కేవలం 1.45 కేజీలు మాత్రమే. ఫైబర్‌ మ్యాట్‌తో పాటు ఫైబర్‌ గ్లాస్‌ను వినియోగించడం వల్ల హెల్మెట్‌ను తక్కువ బరువులోనే రూపొందించ గలిగారు. దీనికి తోడు dot, ece 22.05 ధ్రువీకరణ కలిగిన ఈ హెల్మెట్‌ యాంటీ ఫాగ్‌, యాంటీ స్ర్కాచ్‌ సదుపాయంతో వస్తోంది. మరి ధరెంతో? 549 డాలర్లు అంటే సుమారు రూ.40వేలు. దీన్ని భద్రపరిచేందుకు ఓ బ్యాగ్‌ కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ హెల్మెట్‌పై మీరు ఓ లుక్కేసేయండి..

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు