close

వార్తలు / కథనాలు

₹ 20 వేలలోపు స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా?

అయితే ఈ ఫోన్ల సంగతి ఓసారి చూసేయండి

₹ 20 వేలలోపు స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా?

అదిరిపోయే ఫీచర్లు... ఆకట్టుకునే ధర!

ప్రస్తుతం మొబైల్‌ మార్కెట్‌లో నడుస్తున్న ట్రెండ్‌ ఇదే. కొత్త మొబైల్‌లో కొందామనుకునేవారు ఒకప్పుడు బ్రాండ్‌ ముందు చూసి.. ఆ తర్వాత దాంట్లో ఫీచర్లేంటా అని చూసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ముందు తమ అవసరాలకు తగ్గ ఫోన్‌ ఏదా! అని చూస్తున్నారు. ఆ తర్వాత అది ఏ బ్రాండ్‌, ఏ దేశంలో తయారు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారు. అయితే ఇదంతా బడ్జెట్‌ ఫోన్‌ వినియోగదారుల విషయంలోనే. ఒకప్పుడు బడ్జెట్‌ ఫోన్‌ అంటే ₹ 15 వేల లోపు మాత్రమే. కానీ, ఇప్పుడు అది అలా అలా పెరుగుకుంటూ ₹ 20 వేలకు చేరిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో ₹ 20 వేల ధరలో అందుబాటులో ఉన్న కొన్ని ట్రెండింగ్‌ మొబైల్స్‌ చూద్దామా!

* ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం 1

₹ 15 వేలలోపు స్మార్ట్‌ఫోన్ల రంగంలో షామీ మొబైల్స్‌దే హవా అనుకుంటున్న సమయంలో ‘జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం 1’తో ఆసుస్‌ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ₹ 14,999కే 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీతో మొబైల్‌ను తీసుకొచ్చింది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులో ప్రధాన ప్రత్యేకత. వెనుకవైపు 16 ఎంపీ కెమెరా, 5 ఎంపీ కెమెరా... ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటాయి. స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌ ఉంటుంది. స్టాక్‌ ఆండ్రాయిడ్‌కి దగ్గరకే ఉండే జెన్‌ యూఐ ఇందులో ఉంటుంది.

* షామీ రెడ్‌మీ నోట్‌ 5 ప్రో 
వినియోగదారులకు ఇప్పుడు బడ్జెట్‌ ధరలో ఎక్కువ ఫీచర్లు అందుతున్నాయంటే... అది షామీ వచ్చాకనే అని చెప్పాలి. ఏటా కొత్త ఫీచర్లతో సరికొత్త మొబైల్‌ను షామీ తీసుకొస్తోంది. అలా ఈ ఏడాది వచ్చిన మొబైల్‌ రెడ్‌మీ నోట్‌ 5 ప్రో. స్టాక్‌ ఆండ్రాయిడ్‌ అంటే పెద్దగా ఇష్టముండని వారికి ఈ మొబైల్‌ బాగా నచ్చుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌ ఉంటుంది. వెనుకవైపు 12 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలు... ముందువైపు 20 ఎంపీ కెమెరా ఉంటాయి. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.
* నోకియా 6.1 ప్లస్‌ 
ఆండ్రాయిడ్‌ వన్‌తో కలిసి హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా బ్రాండ్‌పై ‘నోకియా 6.1 ప్లస్‌’ మొబైల్‌ను తీసుకొచ్చింది. నోకియా బ్రాండ్‌ రీ ఎంట్రీ తర్వాత వచ్చిన ఫోన్లతో ఇదే అత్యుత్తమ సేల్స్‌ను రాబడుతోందని టెక్‌ వర్గాల మాట. దీని ధర సుమారు ₹ 16 వేలు. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌, 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయి. ముందువైపు 16 ఎంపీ కెమెరా.. వెనుకవైపు 16 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 5.8 అంగుళాల 19:9 తాకే తెర ఉంటుంది.
 
* మోటో జీ 6
బడ్జెట్‌ ధరలో మోటో నుంచి ‘మోటో జీ 6’ అందుబాటులో ఉంది. ఇటీవల ఈ మొబైల్‌ ధరను తగ్గించడంతో సుమారు ₹ 16 వేలకే లభ్యమవుతోంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉన్నాయి. వెనుకవైపు 12 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలుంటాయి. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది ఇప్పటితరం బడ్జెట్‌ ప్రాసెసర్లు 625, 636 కంటే కాస్త స్లోగా ఉంటుంది.
* షామీ ఎంఐ 2
షామి, ఆండ్రాయిడ్‌ వన్‌ కలసి గతేడాది ‘ఎంఐ ఎ1’ను తీసుకొచ్చింది. అప్పటివరకు ఎంఐయూఐతో మొబైల్స్‌ తీసుకొచ్చిన షామీ... తొలిసారిగా స్టాక్‌ ఆండ్రాయిడ్‌తో తీసుకొచ్చిన ఆ మొబైల్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది ‘ఎంఐ 2’ను విడుదల చేసింది. ఇందులో ఫ్లాగ్‌షిప్‌ లెవల్‌ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 660 ఉంటుంది. ఇందులో 20 ఎంపీ ఏఐ ఫ్రంట్‌ కెమెరా... వెనుకవైపు 12 ఎంపీ, 20 ఎంపీ కెమెరా ఉంటాయి. 3010 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. దీని ధర ₹ 16,999.
* శాంసంగ్‌ గెలాక్సీ జె8 
శాంసంగ్‌ నుంచి ₹ 20 వేల లోపు ధరల్లో ఉన్న మొబైల్స్‌లో శాంసంగ్‌ గెలాక్సీ జె8 పరిశీలించవచ్చు. ఆరు అంగుళాల తాకే తెర, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయి. వెనుకవైపు 16 ఎంపీ కెమెరా, ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉంటాయి. 3500 బ్యాటరీ ఉంటుంది. అయితే ఇందులో స్నాప్‌డ్రాగన్‌ పాత తరం ప్రాసెసర్‌ 450 ఉంటుంది. దీని ధర సుమారు ₹ 18 వేలు. 18:9 యాస్పెక్ట్‌ రేషియో స్ర్కీన్‌ ఉంటుంది.
* ఆనర్‌ ప్లే
గేమర్స్‌ కోసం ఆనర్‌ తీసుకొచ్చిన మొబైల్‌ ఆనర్‌ ప్లే. దీని ధర ₹ 19,999. బెటర్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఇందులో స్మార్ట్‌ షాక్‌ సాంకేతికతతో 4డీ గేమింగ్‌ అనుభూతిని ఈ మొబైల్‌లో పొందుపరిచారు. ఇందులో కిరిన్‌ 970 ఏఐ చిప్‌సెట్‌, 3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో వెనుకవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారిత 16+2 ఎంపీ కెమెరాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలేజేషన్‌, ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలేజేషన్‌ ఉన్నాయి.
* హువావే పీ 20 లైట్‌
హువావే నుంచి ఈ మధ్య కాలంలో చాలా మొబైల్స్‌ వస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో హువావే పీ20 లైట్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. ₹ 20 వేల లోపు ధరలో ఈ మొబైల్‌ మంచి ఆప్షన్లు తీసుకొచ్చింది. 19:9 ఫుల్‌ వ్యూ డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ర్యామ్‌ ఉంటుంది. ముందువైపు ఉండే 24 ఎంపీ వైడ్‌ అపెట్యూర్‌ కెమెరా, త్రీడీ పోర్ట్రైట్‌ కెమెరా లైటింగ్‌ ఎఫెక్ట్‌ దీనికి ప్రధానాకర్షణ. 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, కిరిన్‌ 659 ప్రాసెసర్‌ ఉంటాయి.  
* ఒప్పో ఎఫ్‌ 7
ఒప్పో నుంచి నెలకో కొత్త ఫోన్‌ వస్తుంటుంది. వాటిలో చాలావరకు ₹ 20 వేల కంటే ఎక్కువ ధరలోనే ఉంటాయి. బడ్జెట్‌ ధరలో అంటే ఒప్పో ఎఫ్‌7 ను పరిశీలించవచ్చు. దీని ధర సుమారు ₹ 19.900. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉన్నాయి. వెనుకవైపు 16 ఎంపీ కెమెరా, ముందువైపు 25 ఎంపీ కెమెరా ఉంటాయి. 6.2 అంగుళాల తాకేతెర, 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ , మీడియా టెక్‌ హీలియో పీ60 ప్రాసెసర్‌ దీని ప్రత్యేకతలు.
* ఆపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ
ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లు... ఎప్పుడో వచ్చిన ఐఫోన్‌ ఎస్‌ఈ ఇప్పటికీ ఎవర్‌ గ్రీనే. ₹ 20 వేలలోపు ఫోన్లలో ఐఫోన్‌ ఎస్‌ఈ ఇప్పటికీ పరిశీలించదగ్గదే. సుమారు ₹ 19,999 ధరకు ఐఫోన్‌ ఎస్‌ఈ 64 జీబీ వెర్షన్‌ అందుబాటులో ఉంది. ఇందులో 4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు 12 ఎంపీ కెమెరా, ముందువైపు 1.2 ఎంపీ కెమెరా ఉంటాయి. 1440 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 4జీ ఎల్‌టీఈని సపోర్టు చేస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు