close

వార్తలు / కథనాలు

నోట్లు చిరిగినా డబ్బులిస్తారా..?

నోట్లు చిరిగినా డబ్బులిస్తారా..?

దిల్లీ: చిరిగిన నోట్లు చెల్లక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొంచెం చిరిగినా ఎవరూ తీసుకోరు. సాధారణంగా ఇలాంటి ఇబ్బందులను ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటారు. చిన్ననోట్లయితే ఫర్వాలేదు. కానీ, నోటు విలువ అధికమైతే కష్టమే. అలాంటి వారికి ఉపశమనం కలిగిస్తూ ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. చిరిగిన నోట్లకు తిరిగి చెల్లింపు విషయమై 2009లోనే కొన్ని నియమాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా వాటిలో కొన్ని మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిలో రూ.1 నుంచి రూ.2 వేల వరకు నోటులో ఎంత చిరిగినప్పటికీ ఎంతో కొంత విలువ తిరిగి పొందడానికి వీలు కల్పించింది. రూ.1 నుంచి రూ.20 వరకు సగం నోటు ఉన్నా..పూర్తి విలువ తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆపై విలువున్న నోట్లకు ఎక్కువ భాగం ఉంటే పూర్తి విలువ, అర్ధభాగంలోపు ఉంటే సగం విలువ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూల్స్‌-2018 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. చిరిగిన నోటు పూర్తి విలువ పొందాలంటే ఏ నోటు కనీసం ఎంత మొత్తంలో మిగిలిఉండాలో ఇందులో నిర్దేశించింది. మరి ఆ కొలతలేంటో చూసేద్దామా?


Tags :

మరిన్ని