
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: ఫేస్బుక్ సంస్థకు చెందిన ఇన్స్టాగ్రాం ప్రపంచవ్యాప్తంగా కొద్దిసేపు పనిచేయడం మానేసింది. ‘ప్రస్తుతం దీన్ని ఉపయోగించలేరు’ అనే అర్థం వచ్చేలా ఆ యాప్ ఓపెన్ చేయగానే దాని స్ర్కీన్ మీద కొన్నిపదాలు దర్శనమిచ్చాయి. దాంతో కొందరు ఇన్‌స్టాగ్రామర్స్ చాలా చిరాకుకు గురయ్యారు. దానిపై తమ అసహనాన్ని వ్యక్తం చేయడానికి ట్విటర్‌ను వాడారు. అలాగే ఇన్స్టాగ్రాం డౌన్ అనే హ్యాష్‌ట్యాగ్ తీవ్రంగా ట్రెండ్ అయింది. దానిలో కొన్ని కామెడీ వీడియోలు, కామెంట్లు పెట్టి కొద్ది సేపు ఎంజాయ్ చేశారు. మామూలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేయడానికి నెటిజన్లు ఈ యాప్‌ను ఉపయోగిస్తారు.
* ఇప్పుడు ఎక్కడికి పోవాలి. ఫేస్బుక్ లేక ట్విటర్ అంటూ కొందరు భయంతో కనిపిస్తోన్న ఫొటోను షేర్ చేశారు.
* ఇన్స్టాగ్రాం వినియోగదారులకు స్వాగతం. ఈ రోజు అతికష్టం మీద ఈ రోజు ట్విటర్ ను వాడాలి.
* ఇన్స్టాగ్రాండౌన్ అయిన సంగతిని తమ కొన్ని తరాల వారికి ఈ విధంగా చెప్తారు. ‘ఇదొక పెద్ద ఉపద్రవం’ అంటూ షేర్ చేసిన మీమ్ నవ్విస్తుంది.
* నా జీవితం ఇలా నాశనమైపోయిందేంటి అని ఆహార, ఫ్యాషన్ ప్రియులు ఏడుస్తారు
* ఇన్స్టాగ్రాం మళ్లీ పనిచేయడం మొదలవగానే తమ తినే ఆహారానికి సంబంధించిన ఫొటోలు పెట్టడానికి యూజర్లు సిద్ధంగా ఉన్నారు.
ఇలా ట్విటర్లో రకరకాల వీడియోలు, ఫొటోలు షేర్ చేశారు. అయితే బుధవారం ఉదయం కొంతమంది వినియోగదారులకు ఇది అందుబాటులోకి వచ్చింది. ఇన్స్టాగ్రాండౌన్పై ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఇంతవరకు స్పందించలేదు.