close

వార్తలు / కథనాలు

ఈ గ్రామంలో అందరూ కోటీశ్వరులే

ట్యాక్సీలుండవ్‌.. అన్నీ హెలికాప్టర్లే!

ఈ గ్రామంలో అందరూ కోటీశ్వరులే

బీజింగ్‌: అదో గ్రామం. అక్కడుండేవారంతా కోటీశ్వరులే. ఎక్కడికైనా వెళ్లాలంటే ట్యాక్సీలు బుక్‌ చేసుకోరు. కేవలం హెలికాప్టర్లలోనే ప్రయాణిస్తారు. ఈ ‘రిచెస్ట్‌ విలేజ్‌’ చైనాలో ఉంది. దాని పేరు హువాక్సీ. ఈ హువాక్సీ గ్రామాన్ని 1961లో కనిపెట్టారు. స్థానికుల కథనం ప్రకారం..ఈ గ్రామంలో మల్టీసెక్టార్‌ ఇండస్ట్రీ కంపెనీ ఉంది. ఈ కంపెనీ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ లిస్ట్‌లోనూ ఉంది. గ్రామస్థుల కోసం విమానాలు, పడవలను ఈ కంపెనీనే కొనుగోలు చేసిందట. ఈ గ్రామస్థులంతా ఆ కంపెనీలో షేర్‌హోల్డర్స్‌గా ఉన్నారు. ఏటా కంపెనీకి వచ్చే లాభాల్లో ఒకటిలో ఐదో వంతు లాభం గ్రామస్థులకే వర్తిస్తుంది. 2011లో కంపెనీ టర్నోవర్‌ 6.5 బిలియన్‌ యువాన్లు పెరిగినట్లు అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు. అందుకే ఈ గ్రామం చైనాలోనే రిచెస్ట్‌ గ్రామంగా పేరొందింది. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నివసించే ప్రతీ వ్యక్తి వద్ద మిలియన్‌ యువాన్లు (రూ.1,07,82,656) ఉంటాయి. అంతేకాదు.. వీరందరికీ కారు, ఇల్లు అక్కడి ప్రభుత్వమే ఏర్పాటుచేస్తుంది. ఈ గ్రామం గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం ఇక్కడున్న ఎత్తైన స్కై స్క్రాపర్ (భారీ భవనం) గురించి మాట్లాడుకోవాలి.

ఈ గ్రామంలో అందరూ కోటీశ్వరులే

ఈ గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 72 అంతస్తుల అతిపెద్ద భవనం ఉంది. చైనాలోని అతిపెద్ద భవనాల జాబితాలో ఇది 15వ స్థానంలో ఉంది. ఈ గ్రామంలో ఓ పెద్ద పార్క్‌ కూడా ఉంది. ఈ పార్క్‌లో ప్రపంచంలోని ప్రముఖ కట్టడాలను పోలిన ప్రతిరూపాలు ఉన్నాయి. దాదాపు 240 ఎకరాల్లో ఈ గ్రామాన్ని నిర్మించారు. ఇక్కడికి బయటి ప్రాంతం వారు కూడా వచ్చి ఉండచ్చు. కానీ హువాక్సీ గ్రామస్థులకు మాత్రమే అక్కడి సదుపాయాలు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఈ గ్రామంలో అందరూ కోటీశ్వరులే

ఈ గ్రామంలోనే ఆస్పత్రి, పాఠశాలలు ఉన్నాయి. చదువు, వైద్యం కూడా ఉచితమే. కానీ, ఈ సదుపాయాలు కేవలం హువాక్సీ గ్రామస్థుల కోసం మాత్రమే. ‌బయటి ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఉచిత విద్య, వైద్యం సదుపాయాలు ఉండవు. అయితే ఈ గ్రామంలో నివసించేవారికి ఓ మైనస్‌ పాయింట్‌ కూడా ఉంది. అదేంటంటే.. అక్కడి నివాసితులు వారంలో ఏడు రోజులూ పనిచేయాలి. సెలవులు ఉండవు. అంతేకాదు గ్యాంబ్లింగ్‌కి పాల్పడటం, మాదకద్రవ్యాలు వాడటం వంటివి చేయకూడదు. క్లబ్స్‌, బార్స్‌, ఇంటర్నెట్‌ కెఫెల సదుపాయాలు కూడా లేవు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ గ్రామం నుంచి వెళ్లిపోవాలనుకుంటే తమ వెంట ఏమీ తీసుకెళ్లకూడదు. అన్నీ వదులుకోవాల్సిందే!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు