Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

ఇక ‘కికి’ కాదు కిందపడిపోయే ఛాలెంజ్‌!

ఉన్నోళ్లమని చెప్పుకోవడానికే ఇలా చేస్తారట

ఇక ‘కికి’ కాదు కిందపడిపోయే ఛాలెంజ్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: మొన్నటివరకు ‘కికి’ ఛాలెంజ్‌ ప్రపంచవ్యాప్తంగా తెగ రచ్చ చేసేసింది. ఆ తర్వాత కూడా చిన్న చిన్న ఛాలెంజ్‌లు సోషల్‌మీడియాలో కొన్నిరోజులు చక్కర్లు కొట్టాయి కానీ ఇప్పుడు మరో వినూత్నమైన ఛాలెంజ్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఆకట్టుకుంటోంది అని చెప్పడం కంటే ఆశ్చర్యానికి గురిచేస్తోంది అని చెప్పాలి. ఎందుకంటే ‘కికి’ లాంటి ఛాలెంజ్‌లు ఏదో సరదా కోసం చిన్నా పెద్దా తేడాలేకుండా చాలా మంది చేశారు. కానీ ఈ ఛాలెంజ్‌ను మాత్రం కేవలం తాము కోటీశ్వరులమని చెప్పుకోవడానికే చేస్తారట.

ఇక ‘కికి’ కాదు కిందపడిపోయే ఛాలెంజ్‌!

విడ్డూరంగా ఉంది కదూ..! ఇంతకీ ఈ ఛాలెంజ్‌ పేరేంటంటే.. ‘ఫ్లాంట్‌ యువర్‌ వెల్త్‌’. ఈ ఛాలెంజ్‌ను ఎలా చేస్తారంటే.. ఓ వ్యక్తి ఉన్నట్టుండి కిందపడిపోయినట్లుగా నటిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి చేతిలో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. చూసినవారు అతను నిజంగానే పడిపోయారని వారికి సాయం చేద్దామనుకుంటారు. అప్పుడు వారి వస్తువులను చూసి వీరు బాగా డబ్బున్నవారని అనుకుంటారట. అలా తాము ఉన్నోళ్లమని చెప్పుకోవడానికి ఇలా ‘ఫ్లాంట్‌ యువర్‌ వెల్త్‌’ అనే ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారట.

ఇక ‘కికి’ కాదు కిందపడిపోయే ఛాలెంజ్‌!

ఈ ఛాలెంజ్‌ రష్యాలో మొదలైందని సౌథ్‌ చైనా మార్నింగ్ పోస్ట్‌ వెల్లడించింది. ఈ ఛాలెంజ్‌లో సెలబ్రిటీలు కూడా పాల్గొంటుండడం గమనార్హం. ఛాలెంజ్‌లో పాల్గొన్నప్పుడు తీసిన ఫొటోలను నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దాంతో ఈ ఛాలెంజ్‌ కాస్తా వైరల్‌ అవుతోంది. అయితే ఈ ఛాలెంజ్‌ చేయడం వల్ల ఓ యువతి సమస్యల్లో చిక్కుకుంది. చైనాలోని షాంఘాయ్‌కు చెందిన ఓ యువతి రోడ్డుపై ఈ ఛాలెంజ్‌ చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. దాంతో ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించావంటూ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు