close

వార్తలు / కథనాలు

దంతాలు తెల్లగానే ఎందుకుండాలి..?

నెట్టింట్లో వైరల్‌ అవుతున్న కొత్త ట్రెండ్‌

దంతాలు తెల్లగానే ఎందుకుండాలి..?

ఇంటర్నెట్‌డెస్క్‌: దంతాలు పసుపు రంగులో ఉంటే నలుగురిలో ఇబ్బందిపడుతుంటారు. పళ్లు తెల్లగా ఉండటానికి నిమ్మకాయ, ఉప్పు, బేకింగ్‌ సోడా ఉపయోగించి.. ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. దంతాలు తెల్లగా ఉండడం కోసం ప్రత్యేకించి టూత్‌పేస్ట్‌లు కూడా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. కానీ దంతాలు తెల్లగానే ఎందుకు ఉండాలి? నీలం, ఎరుపు, ఇంద్రధనస్సు రంగుల్లో ఉంటే ఎలా ఉంటుంది? ఇదేం ఫ్యాషనండీ బాబూ..! అనుకుంటున్నారా? కానీ ఈ ట్రెండ్‌ ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఎన్నో రకాల రంగుల లిప్‌స్టిక్స్‌ వేసుకుంటున్నప్పుడు..వాటికి తగ్గట్టుగా రంగురంగుల దంతాలు ఎందుకు ఉండకూడదు? అని ఆలోచించి క్రోమ్‌ అనే బ్యూటీ సంస్థ.

దంతాలు తెల్లగానే ఎందుకుండాలి..?

అమెరికాకు చెందిన ఈ బ్యూటీ సంస్థ రెయిన్‌బో టూత్‌ పేరిట నెయిల్‌ పాలిష్‌ లాగే టూత్‌ పాలిష్‌ను అమ్ముతోంది. అచ్చం నెయిల్‌ పాలిష్‌ ఆకారంలో ఉండే ఇవి దంతాలకు రాసుకుంటే రంగులతో మెరిసిపోతాయి. పింక్‌, నీలం, ఆకుపచ్చ, బంగారు, వెండి రంగుల్లో ఈ టూత్‌ పాలిష్‌లు లభ్యమవుతున్నాయి. ఒక్కసారి రాసుకుంటే 24 గంటల పాటు రంగు పోకుండా ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రముఖ గాయకుడు టెకాషిని స్ఫూర్తిగా తీసుకుని డేవిడ్‌ సిల్వర్‌స్టీన్‌ ఈ టూత్‌ నెయిల్‌పాలిష్‌లను రూపొందించారు. టెకాషి ఒంటినిండా టాటూలు, రంగురంగుల దంతాల, హెయిర్‌స్టైల్‌తో విచిత్రంగా ఉంటాడు. ఈ ట్రెండ్‌ యువతకు తప్పకుండా నచ్చుతుందని డేవిడ్‌ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

దంతాలు తెల్లగానే ఎందుకుండాలి..?

దంతాలు తెల్లగానే ఎందుకుండాలి..?


Tags :

మరిన్ని